https://oktelugu.com/

Mahesh Babu: ఆ సంస్థపై ట్రోల్స్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!

Mahesh Babu: పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆజాగ్రత్తగా వ్యవహరించినా వారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు. గతంలో ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విషయంలో యూవీ క్రియేషన్స్ ‘డార్లింగ్’ ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారింది. ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ సంస్థను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ వారంతా ట్రోల్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి మైత్రీ మూవీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 6, 2022 / 10:26 AM IST
    Follow us on

    Mahesh Babu: పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆజాగ్రత్తగా వ్యవహరించినా వారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు. గతంలో ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విషయంలో యూవీ క్రియేషన్స్ ‘డార్లింగ్’ ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారింది. ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ సంస్థను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ వారంతా ట్రోల్ చేసిన సంగతి తెల్సిందే.

    Mahesh Babu

    తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి మైత్రీ మూవీ మేకర్స్ గురైంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ ‘సర్కారువారిపాట’ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పర్శురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ బాబుకు జోడిగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    2022 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితులతో షూటింగ్ వాయిదా పడింది. ఈ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగులో పాల్గొన్న మహేష్ బాబు, కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కరోనా బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

    అయితే సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నిర్మాతలపై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నాయి. చిన్న సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా మూవీ పోస్టర్, టీజర్స్, టైలర్స్ వంటి అప్డేడ్ ఇచ్చాయని అంటున్నారు. కానీ మహేష్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మీకు బాధ్యత లేదా? అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు. ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేనంత బిజీగా ఏం చేస్తున్నారంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.