Mahesh Babu: భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే మరొక ఫ్లాప్ సినిమాగా మిగిలింది. ఇక ఇలాంటి సమయంలో మహేష్ బాబు ఎవరిని దూషించకుండా ఈ సినిమా తను చేయడం వల్లే ఫ్లాప్ అయింది అనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇక అందులో భాగం గానే తనని తాను కూల్ చేసుకొని ఇక నెక్స్ట్ రాజమౌళి సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందుకోసమే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఏది చెప్తే అది చేయడానికి రెఢీ అయిపోయి ఆయన చెప్పినవి తూచ తప్పకుండా ఫాలో అవుతూ ఈ సినిమాను చేసి ఒక భారీ హిట్ అందుకోవడమే ఇప్పుడు మహేష్ బాబు పెట్టుకున్న గోల్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోయాడు.
ఇక దాంతో ఈ సినిమా విషయం లో నిరాశ పడ్డ ప్రేక్షకులు మళ్లీ రాజమౌళి సినిమాతో కాలర్ ఎగరేసుకొని తిరగేలా చేయాలనే ఉద్దేశ్యం తోనే మహేష్ బాబు ఈ సినిమా మీద పూర్తి ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇక అందులో భాగం గానే తన బాడీ కి సంబంధించిన మేకోవర్ తో సహా అన్ని రాజమౌళి చెప్పినట్టు గా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా 2024 సమ్మర్ నుంచి షూటింగ్ కి వెళ్ళనున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈలోపు మహేష్ బాబు తనకున్న కమిట్ మెంట్స్ ని ఫినిష్ చేసుకొని ఫుల్ గా ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ లో తన సత్తా చూపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద 800 కోట్ల వరకు బడ్జెట్ ని పెట్టబోతున్నాట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో రాజమౌళి బాహుబలి 2 రికార్డ్ లను బ్రేక్ చేస్తారేమో చూడాలి. బాహుబలి 2 ఇండియా వైడ్ గా 2000 కోట్ల భారీ కలక్షన్ల ను రాబట్టింది. అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా బడ్జెట్ 800 కోట్లు పెడుతున్నారు అంటే ఈ సినిమా దాదాపు గా 3000 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ అంచనా వేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాని రాజమౌళి ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో అలాగే మహేష్ బాబు కెరియర్ లో ఇది ఒక గుర్తుండి పోయే సినిమా అవుతుందంటూ చాలామంది వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…