Site icon OkTelugu

Mahesh Babu And Namrata Shirodkar: మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఎవరు బాగా సెట్ అవుతారో చెప్పిన నమ్రత…

Mahesh Babu And Namrata

Mahesh Babu- Namrata Shirodkar

Mahesh Babu And Namrata Shirodkar: సినిమా ఇండస్ట్రీ లో నటీనటుల మధ్య చాలా మంచి బాండింగ్ అయితే కుదురుతుంది. ఒక సినిమా కోసం వాళ్లు ఒక సంవత్సర కాలం పాటు కలిసి ట్రావెల్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఆటోమేటిగ్గా ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం వరుస సినిమాలు చేస్తున్న సమయంలో తన సహ నటి అయిన నమ్రత శిరోడ్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేయాలి అనే విషయాన్ని కూడా నమ్రత నే డిసైడ్ చేస్తుంది. మహేష్ సినిమాలకు సంబంధించిన విషయాలనే కాకుండా బిజినెస్ వ్యవహారాలను కూడా నమ్రత దగ్గరుండి మరి చూసుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుకి కో ఆర్టిస్ట్ గా ఎవరు బాగా సెట్ అయ్యారు అని ఆమెని అడిగితే ఆమె మొదట ‘మురారి’ సినిమాలో ‘సోనాలి బింద్రే’ మహేష్ పక్కన బాగా సెట్ అయిందని చెప్పింది.

ఇక ఆమె తర్వాత సమంత, త్రిష కూడా మహేష్ పక్కన బాగా సెటవుతారని చెప్పడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఆమె చెప్పినట్టుగా మురారి సినిమాలో మహేష్ బాబు – సోనాలి బింద్రే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. బావ మరదలుగా వాళ్ళిద్దరూ ప్రేక్షకులను అలరించారు.

మొత్తానికైతే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మహేష్ బాబు కెరియర్ లోనే మొదటి సూపర్ సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్ లను సాధిస్తూ అంతకంతకు తన రేంజ్ ను పెంచుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు నుంచే వచ్చే సినిమాల విషయంలో నమ్రత చాలా కేర్ఫుల్ గా ఉంటారట.

మొదట ఆ కథని తను విని ప్రేక్షకులు మహేష్ బాబు నుంచి ఏం కోరుకుంటున్నారు, అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటున్నారు వాటన్నింటిని క్యాలిక్లెట్ చేసి మరి ఆమె మహేష్ బాబు సినిమాని సెట్ చేసి పెడతారట…ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు…

Exit mobile version