Mahesh Babu: కృష్ణ నటవారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. సూపర్ స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో ఒకరిగా ఉన్నారు. మహేష్ సినిమాకు యాభై కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మహేష్ కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మహేష్ పేరిట ఓ అరుదైన రికార్డు ఉంది. మహేష్ ఇంత వరకు ఒక్క రీమేక్ కూడా చేయలేదు. కారణం తెలియదు కానీ ఆయన రీమేక్స్ పట్ల ఆసక్తి చూపరు.
కొందరు హీరోలు రీమేక్స్ ఇష్టపడరు. ఒకరు చేసిన కథను చేయడానికి ఆసక్తి చూపరు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఫ్రెష్ గా ఆడియన్స్ కి కొత్త కథ చెప్పాలని ఒక ఆలోచన. అలాగే రీమేక్స్ తో పోలికలు వస్తాయి. మూవీ విజయం సాధించినా కూడా పెద్దగా క్రెడిట్ ఇవ్వరు. మహేష్ తోటి హీరోలు కెరీర్లో కనీసం ఒకటో రెండో రీమేక్ చిత్రాలు చేశారు. మహేష్ మాత్రం వాటి జోలికి పోలేదు.
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీ చేస్తున్నారు. లేటెస్ట్ షెడ్యూల్ జులై నుండి మొదలు కానుంది. 2024 సంక్రాంతి టార్గెట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే చిత్రీకరణలో కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అనూహ్యంగా పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తన పాత్ర ప్రాధాన్యత తగ్గించేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేసి పూజాను సెకండ్ హీరోయిన్ గా డిమోట్ చేశారట.
పూజా స్థానంలో ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు మహేష్ 29వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ మహేష్ బాబుకు చాలా స్పెషల్. ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి రూ. 800 కోట్ల బడ్జెట్ తో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. మహేష్-రాజమౌళి మూవీ హాలీవుడ్ చిత్రాలను తలదన్నే స్థాయిలో ఉండనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.