Mahesh Babu Favorite Hero: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన హీరోకి చాలామంది అభిమానులుగా మారతారు. వాళ్ళ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకున్న హీరోలందరు గొప్ప సినిమాలను చేసే ప్రాసెస్ లో ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళందరూ ఇండస్ట్రి హిట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం మీద విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడతానని మహేష్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మరి ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఇండియాలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో మహేష్ బాబుకి ఫేవరెట్ హీరో ఎవరు అంటూ గత కొన్ని రోజులనుంచి సోషల్ మీడియా విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి.
నిజానికి ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మహేష్ బాబుకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైన ఒదిగిపోయి నటిస్తాడని అందుకే ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టమని మహేష్ పాలు సందర్భాల్లో తెలియజేశాడు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ సైతం మహేష్ బాబుకి రెస్పెక్ట్ ఇస్తూ మహేష్ అన్న అని పిలుస్తూ ఉంటాడు.
మహేష్ బాబు హీరోగా చేసిన ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం… ఇక వీళ్లిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు కలిసి నటించిన చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురు చూస్తూ ఉండడం విశేషం… వీళ్లిద్దరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…