Rajamouli-Mahesh Babu: రాజమౌళి సినిమాకు ఒక్క రూపాయి కూడా వద్దన్న మహేష్ బాబు..?

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అధికారిక ప్రకటన విడుదల అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఏ అప్డేట్ వచ్చినా తెగ సంతోషిస్తున్నారు ఇద్దరి స్టార్ల అభిమానులు.

Written By: Swathi, Updated On : January 29, 2024 3:08 pm
Follow us on

Rajamouli-Mahesh Babu: రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఏ రేంజ్ లో హిట్ ను అందుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈయనతో సినిమా చేయాలని ఎంతో మంది ఆరాటపడుతుంటారు. కానీ ఆ అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. వచ్చినా కూడా రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏకంగా రెండు మూడు సంవత్సరాలు ఆయన సినిమా బయటకు రాదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు జక్కన్న. వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పటి నుంచో సినిమా వస్తుందనే టాక్ ఉంది. ఎట్టకేలకు ఈ విషయాన్ని జక్కన్న ప్రకటించారు.

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అధికారిక ప్రకటన విడుదల అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఏ అప్డేట్ వచ్చినా తెగ సంతోషిస్తున్నారు ఇద్దరి స్టార్ల అభిమానులు. ఇక ప్రస్తుతం ఓ ఫైనాన్సియల్ విషయం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. వీలైనంత తొందరలోనే సినిమాను మొదలు పెడతారట దర్శకుడు రాజమౌళి. అంతేకాదు సినిమాకు సంబంధించిన సన్నాహాలు కూడా జోరందుకున్నాయి.

ఇప్పటికే ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయిందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మహేష్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే రాజమౌళి ఈ సినిమా కోసం మహేష్ బాబు డేట్స్ ను రెండు సంవత్సరాల వరకు బ్లాక్ చేశారట. అంటే భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పాల్సిందే. స్టార్ డం ఉన్న వ్యక్తి రెండు సంవత్సరాలు తన డేట్స్ ను ఇవ్వడం మామూలు విషయం కాదు.

రెండు సంవత్సరాలకు డేట్స్ తీసుకోవడం అంటే రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇవ్వాల్సిందే. అంట సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది అని ఆలోచిస్తున్నారట జక్కన్న. అయితే మహేష్ బాబు రెండు కాదు మూడు సంవత్సరాల పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. కానీ తన రాజమౌళి, మహేష్ కెరీర్ లలో నిలిచిపోయే చిత్రం కావాలని ఆశిస్తున్నారట మహేష్ బాబు. అంతే కాదు అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అంటున్నారట మహేష్ బాబు. ఇదిలా ఉంటే రెమ్యూనరేషన్ ఇవ్వకుండా పార్ట్నర్ గా పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారట జక్కన్న.

సినిమాకు వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటున్నారు అన్నమాట. మరి ఈ విషయానికి మహేష్ బాబు ఒప్పుకుంటారా లేదా? ఈ ప్రపోజల్ ను మహేష్ ముందు ఎప్పుడు ఉంచుతారని అనుకుంటున్నారు నెటిజన్లు. అయితే ఇప్పటికే ఈ విషయం మహేష్ బాబుకు తెలుసు అని.. ఆయన ప్రతిపాదనకు మిల్క్ స్టార్ అంగీకరించారని కూడా టాక్. అంతేకాదు సినిమా పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.