Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఆయన రాజకుమారుడు సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికి మురారి, ఒక్కడు లాంటి సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమాలన్నీ అతనికి ఒక డిఫరెంట్ ఇమేజ్ అయితే ఇచ్చాయి. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమాతో ఆయన మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు… ఇక ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఎప్పుడు పడనంత కష్టమైతే పడుతున్నాడట. కారణం ఏంటంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం అలాగే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి.
కాబట్టి రాజమౌళి ఈ సినిమాని ఒక్కొక్క ఫ్రేమ్ చెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం మహేష్ బాబు సైతం విపరీతంగా కష్టపడుతున్నారట. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మరొక సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు.
50 సంవత్సరాల వయసులో కూడా అలా ఉండడం అనేది మామూలు విషయం కాదు. మరి మహేష్ బాబు ఎందుకని రోజు రోజుకి అందంగా తయారవుతున్నాడు. ఏజ్ పెరిగే కొద్ది ఆయన ఇంకా యాక్టివ్ గా, అందంగా ఎలా కనిపిస్తున్నాడనే విషయంలోనే చాలా వరకు చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి మహేష్ బాబు ఫుడ్ డైట్ అయితే తీసుకుంటూ ఉంటాడు.
తను లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఆయన తినే తిండికి మైంటైన్ చేసి లగ్జరీ లైఫ్ కి తను తాగే వాటర్ కి, తన డ్రెస్ లకు తన హెయిర్ మెయింటెనెస్ మొత్తం అన్నింటికి కలిపి దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందట… మొత్తానికైతే నెలకి దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుందట…
