Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు… మహేష్ బాబు సైతం ఇప్పుడు వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడానికి ముందుకు సాగుతున్న ఆయన సినిమాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ‘కొడుకులు దిద్దిన కాపురం’ అనే సినిమా చేశాడు.
అందులో కొన్ని బైక్ స్టంట్స్ ఉండటం వల్ల మహేష్ బాబు చేశాడు. అయితే ఈ సినిమాని కృష్ణ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. కాబట్టి ఈ సినిమాలో కొన్ని రిస్కీ షాట్స్ ఉండడం వల్ల వాటిని డూప్ లేకుండా మహేష్ బాబు తనే చేశాడు. దాంతో కృష్ణ తన మీద కొంతవరకు కోపానికి వచ్చాడట…
ముందుగా మహేష్ బాబు ఆ సన్నివేశాలను చిత్రీకరించక ముందే నేను ఓన్ గా చేస్తానని కృష్ణతో చెప్పారట. దానికి కృష్ణ మాత్రం ఒప్పుకోలేదు… ఇక కృష్ణ గారు లేని సమయాన్ని చూసి మహేష్ బాబు ఆ బైక్ సన్నివేశాలను ఓన్ గా చేశాడు. ఇక మొత్తానికైతే కృష్ణ ఆ విషయాన్ని తెలుసుకొని కోపానికి వచ్చిన మహేష్ బాబుతో మరోసారి ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తే మామూలుగా ఉండదని బెదిరించారట.
అప్పటినుంచి మహేష్ బాబు తను ఏ సినిమాలో నటించిన డూప్ లను పెట్టుకొని కొన్ని సన్నివేశాలైతే చేస్తున్నాడు. ఇక ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో సైతం కొన్ని రిస్కీ షాట్స్ ను తను ఓన్ గా చేశాడు…ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు సినిమా కోసం ఏదైనా చేస్తాడని చెప్పడానికి దీన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు సైతం ని రిస్కీ షాట్స్ అయితే తను ఓన్ గా చేస్తున్నాడట…చూడాలి మరి ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…
