https://oktelugu.com/

ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన త్రివిక్రమ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు పర్శురాంతో కలిసి ‘సర్కారువారిపాట’ మూవీ చేస్తున్నాడు. ఈమూవీ పూర్తయిన వెంటనే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ రానుంది. ఇందులో ఓ బడా హీరో నటిస్తున్నాడనే టాక్ విన్పిస్తోంది. త్రివిక్రమ్-మహేష్ చిత్రం మల్టీస్టారర్ గా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Also Read: మహేష్ సినిమా పై విజయ్ దేవరకొండ కామెంట్స్ ! కొంతకాలంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 10, 2020 / 01:05 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు పర్శురాంతో కలిసి ‘సర్కారువారిపాట’ మూవీ చేస్తున్నాడు. ఈమూవీ పూర్తయిన వెంటనే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ రానుంది. ఇందులో ఓ బడా హీరో నటిస్తున్నాడనే టాక్ విన్పిస్తోంది. త్రివిక్రమ్-మహేష్ చిత్రం మల్టీస్టారర్ గా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

    Also Read: మహేష్ సినిమా పై విజయ్ దేవరకొండ కామెంట్స్ !

    కొంతకాలంగా టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోలంతా తమ ఇమేజ్ ను పక్కనపెట్టి మల్టిస్టారర్ మూవీలో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రేక్షకులు సైతం ఈ సినిమాలను ఆదరిస్తుండటంతో టాలీవుడ్లో కొత్తకొత్త కాంబినేషన్లు పుట్టుకొస్తున్నాయి. మొదటితరం హీరోల కాలంలో తెలుగులో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత కాలంలో చాలా ఏళ్లుపాటు తెలుగులో మల్టిస్టారర్ మూవీలు రాలేదు.

    ప్రస్తుతం ఇప్పుడున్న హీరోలంతా స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఇగోలకు తావులేకుండా ఒకరి సినిమాలకు ఒకరు ప్రమోట్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఇటీవల తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘గోపాల..గోపాల’..‘మనం’.. ‘ఎఫ్-2’, ‘వెంకీమామ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు చూపించాయి. దీంతో పలువురు దర్శక, నిర్మాతలు మల్టిస్టారర్ మూవీలు చేసేందుకు కాంబినేషన్లను సెట్ చేస్తున్నారు.

    Also Read: బిగ్ బాస్: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అవినాష్‌ ఎమోషన్‌

    దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా మల్టిస్టారర్ మూవీ రాబోతుంది. ఇందులో ఎన్టీఆర్.. రాంచరణ్ నటిస్తున్నారు. ఈనేపథ్యంలో త్రివిక్రమ్ సైతం మల్టిస్టారర్ మూవీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. మరోసారి మహేష్-విక్టరీ వెంకటేష్ కాంబో సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ అన్నగా వెంకటేష్ నటిస్తాడట. ఈమేరకు త్రివిక్రమ్ స్క్రీప్టు రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ‘సర్కారువారిపాట’తో.. వెంకటేష్ ‘నారప్ప’ మూవీలో నటిస్తున్నాడు. దీంతో ఈ కాంబినేషన్ 2021సంవత్సరంలో పట్టాలెక్కుందనే టాక్ విన్పిస్తోంది.