Mahesh Babu and Pawan Kalyan : ఇండియా లో నెటిజెన్స్ సినిమాల రివ్యూస్ ని తెలుసుకోవడానికి ఎక్కువ శాతం చూసే వెబ్ సైట్ ఏదైనా ఉందా అంటే అది IMDB. ఇందులో రేటింగ్స్ వచ్చాయంటే కచ్చితంగా నమ్మే విధంగా ఉంటుంది. ఒక సినిమా భవిష్యత్తుని నిర్ణయించే సత్తా ఈ వెబ్ సైట్ కి ఉంటుంది. కేవలం సినిమాలకు మాత్రమే కాదు. హీరోలకు కూడా ర్యాంకింగ్స్ ఇస్తుంది ఈ IMDB వెబ్ సైట్. 2024 వ సంవత్సరం కి గాను ఇండియా మొత్తం మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానం లో నిల్చినట్టు IMDB ప్రకటించింది. పుష్ప 2 చిత్రం సంచలన విజయం సాధించడం, ఆ సినిమా థియేటర్స్ లో రన్నింగ్ లో ఉన్న సమయంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వంటి సంఘటనల కారణంగా ఆయన పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. అందుకే ఆయన గత ఏడాది నెంబర్ 1 స్థానం లో నిలిచాడని విశ్లేషకుల అభిప్రాయం.
ఇక ఆ తర్వాతి స్థానం లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. గత ఏడాది ఆయన సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాకపోయినా, IPL లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీం ట్రోఫీ ని కొట్టడంతో షారుఖ్ ఖాన్ దేశవ్యాప్తంగా మారుమోగింది. అందుకే రెండవ స్థానం లో ఉన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానం లో కేజీఎఫ్ హీరో యాష్, నాల్గవ స్థానం లో రణబీర్ కపూర్ వంటి వారు ఉన్నారు. అదే విధంగా 7 వ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉండగా, 8వ స్థానం లో రామ్ చరణ్ ఉన్నారు. ఓవరాల్ గా మన టాలీవుడ్ నుండి టాప్ 10 లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ పేర్లు మాత్రమే ఉండడం గమనార్హం. 11 వ స్థానం లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే, 25 వ స్థానం లో మహేష్ బాబు ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ నుండి గత ఏడాది ఎలాంటి సినిమాలు రాలేదు కాబట్టి, ఆయన ఈ లిస్ట్ లో లేడు. కానీ మహేష్ బాబు మాత్రం గత ఏడాది ‘గుంటూరు కారం’ చిత్రం చేసాడు. అదే విధంగా రాజమౌళి తో సినిమా కూడా అధికారికంగా ప్రకటించారు, అయినప్పటికీ కూడా ఆయన పేరు IMDB లో 25వ స్థానం లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ IMDB సర్వే ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది అనేది నెటిజెన్స్ కి అర్థం కావడం లేదు. అయితే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు మాత్రం గత మూడేళ్ళ నుండి టాప్ 10 లో మిస్ కాకుండా వస్తున్నాయి. అంటే ఈ ముగ్గురికి మాత్రమే పాన్ ఇండియా లెవెల్ లో నిజమైన క్రేజ్ ఉందన్నమాట అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.