Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Allu Arjun Rivalry: అల్లు అర్జున్ ని లెక్క చేయని సూపర్ స్టార్...

Mahesh Babu Allu Arjun Rivalry: అల్లు అర్జున్ ని లెక్క చేయని సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇంత కోపం ఎందుకు..

Mahesh Babu Allu Arjun Rivalry: సోషల్ మీడియా స్టార్ హీరోలకు సంబంధించిన అభిమానులు కొట్లాడుకోవడం అనేది కొత్త విషయం కాదు. మా హీరో గొప్పంటే , మా హీరో గొప్ప అంటూ అభిమానులు దుర్భాషలు ఆడుతుంటారు. అభిమానులు ఎలా ఉన్నప్పటికీ , హీరోలు మాత్రం చాలా స్నేహంగా ఉంటారని , వాళ్ళ మధ్య ఉండే స్నేహపూర్వక వాతావరణం కారణంగా, అభిమానులు కూడా ఎదో ఒకరోజు అలా స్నేహంగా ఉండడం అలవాటు చేసుకుంటారని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేసేవారు. నిజానికి హీరోలంతా అలాగే ఉన్నారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య , చాలా కాలం నుండి కోల్డ్ వార్ నడుస్తోంది. 2020 వ సంవత్సరం లో వీళ్లిద్దరు హీరోలుగా నటించిన ‘అలా వైకుంఠపురంలో ‘, ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రాలు విడుదల అయ్యాయి.

రెండు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్స్ అయ్యాయి. కానీ రిలీజ్ డేట్ విషయం లో వీళ్ళ మధ్య చిచ్చు రేగింది. జనవరి 11 న ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అప్పట్లో ప్రకటన చేశారు. అదే రోజున ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం కూడా విడుదల కాబోతుందని ఆ సినిమా నిర్మాతలు కూడా అధికారిక ప్రకటన చేశారు. ఇక్కడే మొదలైంది గొడవ. జనవరి 11 నుండి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అల్లు అర్జున్ బలంగా చెప్పడం, ఆ తర్వాత రెండు సినిమాల మేకర్స్ మధ్య చర్చ జరిగినప్పటికీ కూడా అవి విఫలం అవ్వడం వంటివి ఈ ఇద్దరి హీరోల మధ్య గ్యాప్ ఏర్పడేలా చేసింది. సోలో ఓపెనింగ్ డే కోసం ఇద్దరి హీరోల నిర్మాతల మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయట. చివరికి చిరంజీవి మద్యస్తం చేయడం తో అల్లు అర్జున్ కాస్త తగ్గాడు. కానీ మహేష్ బాబు మనసులో మాత్రం అల్లు అర్జున్ మీద చెడు అభిప్రాయం అలాగే ఉండిపోయింది.

ప్రతీ స్టార్ హీరో పుట్టినరోజు కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపే మహేష్ బాబు , అల్లు అర్జున్ పుట్టిన రోజు కి మాత్రం సైలెంట్ గా ఉంటాడు. నిన్న ప్రభాస్ మినహా , దాదాపుగా స్టార్ హీరోలందరూ అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ మహేష్ బాబు మాత్రం చెప్పలేదు. మరోపక్క ప్రస్తుతానికి సోషల్ మీడియా లో మహేష్ , అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మంచి సఖ్యత వాతావరణం ఉంది. ఈ ఇద్దరి హీరోల అభిమానులు కలిసి పవన్ కళ్యాణ్ , ప్రభాస్ అభిమానుల పై ట్రోల్స్ వేస్తుంటారు. అంత యూనిటీ గా ఉన్నారు. కానీ హీరోలు మాత్రం ఎడమొహం , పెడమొహం అన్నట్టుగా ఉన్నారు. భవిష్యత్తులో అయినా వీళ్ళ మధ్య మనస్పర్థలు చెరిగిపోతాయో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version