Ram Charan Peddi movie Success: భారీ హైప్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్స్ రావడం సహజమే, కానీ లాంగ్ రన్ రావాలంటే మంచి సీజన్ ఉండాలి. సీజన్ లో విడుదల అవ్వకపోతే ఎంత మంచి సూపర్ హిట్ సినిమాకు అయినా పొటెన్షియల్ కి తగ్గ కలెక్షన్స్ ఉండవు. అందుకు ది బెస్ట్ ఉదాహరణ గత ఏడాది విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 321 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాకు లాంగ్ రన్ లో ఫ్రీ గ్రౌండ్ లేదు. ఈ చిత్రం విడుదలైన వారం రోజులకే ‘కాంతారా 2’ వంటి భారీ పాన్ ఇండియన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో చాలా వరకు ఓజీ కి రావాల్సిన వసూళ్లు , ఈ చిత్రానికి డివైడ్ అయ్యాయి.
అలా ‘ఓజీ’ చిత్రం థియేటర్స్ లో ఉన్నన్ని రోజులు ప్రతీ రోజు ఎదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉండేది. ఆ కారణం చేత ఈ చిత్రం లాంగ్ రన్ పై చాలా బలమైన ప్రభావం పడింది. లేదంటే మరో 50 కోట్ల గ్రాస్ వసూళ్లు అదనంగా రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఓజీ లాగా కాకుండా , ఒక సినిమాకు భారీ లాంగ్ రావాలంటే , ఎలాంటి సీజన్స్ ఉండాలో ఉదాహరణగా నిలిచాయి ‘పెద్ది’, ‘మహర్షి’ చిత్రాలు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సమ్మర్ సీజన్ బాగా కలిసొచ్చింది. మరో జాక్ పాట్ ఏమిటంటే , ఈ రెండు సినిమాలకు పోటీ గా కనీసం మీడియం రేంజ్ సినిమాలు కూడా లేకపోవడం.
‘పెద్ది’ చిత్రం విడుదలై 11 రోజులు పూర్తి అయ్యింది. ఈ 11 రోజుల్లో ఈ చిత్రానికి పోటీ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. రాబట్టాల్సిన వసూళ్లు మొత్తం ఈ 11 రోజుల్లోనే లాగేసింది , బయ్యర్స్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ సేఫ్ అయ్యారు. ఈ నెల 19 వరకు ‘పెద్ది’ కి తిరుగేలేదు. 19 న సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు భారీ థియేటర్స్ ఏ మాత్రం అవసరం లేదు కాబట్టి , పెద్ది చిత్రం వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. జూన్ 25 న విడుదల అవ్వాల్సిన ‘లెనిన్’ కూడా వాయిదా పడింది. దీంతో ఈ నెల మొత్తం ‘పెద్ది’ కి తిరుగే లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సందర్భమే ‘మహర్షి’ చిత్రానికి ఎదురైంది. సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రానికి పోటీ గా అప్పట్లో కనీసం చిన్న సినిమా కూడా రాలేదు , ఆడియన్స్ కి కేవలం ఈ సినిమా ఒక్కటే ఛాయస్ అవ్వడం తో లాంగ్ రన్ ఇరగకుమ్మేసింది. అలా సోలో సమ్మర్ సీజన్స్ లో ఈ ఇద్దరి హీరోల సినిమాలు విడుదల అవ్వడం వాళ్ళ అదృష్టం అనే చెప్పొచ్చు.
