Madharasi Trailer Review: తమిళనాడు లో ప్రస్తుతం స్టార్ హీరో స్టేటస్ కి అతి చేరువలో ఉన్న హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan). గత ఏడాది ఆయన ‘అమరన్’ చిత్రం తో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన ‘మదరాశి’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ‘గజినీ’, ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈమధ్య కాలం లో మురుగదాస్ తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ మధ్య అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. సర్కార్, దర్బార్ చిత్రాలు యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ అవి హీరోల స్టార్ స్టేటస్ ఖాతాలోకి వెళ్లాయి. ఈ ఏడాది ఆయన సల్మాన్ ఖాన్ తో తీసిన ‘సికిందర్’ అనే చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
ఈ సినిమా చేస్తున్న సమయం లోనే ఆయన సమాంతరంగా ‘మదరాశి'(Madrasi Movie) చిత్రాన్ని కూడా మొదలు పెట్టారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్ననే విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు ఫార్మ్ లో లేని మురుగదాస్ నుండి ఈ రేంజ్ కంటెంట్ ని ఊహించలేదని, బలమైన కాన్సెప్ట్ తో ఈసారి వచ్చినట్టుగా అనిపిస్తుందని, ట్రైలర్ లోనే ఈ రేంజ్ యాక్షన్ సన్నివేశాలను చూపించారంటే,సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయో ఊహించుకోవచ్చని అంటున్నారు. అక్రమ ఆయుధాలు తమిళనాడు సిటీ లోకి తీసుకొని రావడం పై హీరో చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథ అని తెలుస్తుంది.
సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న హీరో క్యారక్టర్ ఈ వ్యవహారం లోకి ఎలా అడుగుపెట్టింది అనేదే ఈ సినిమా నేపథ్యం అని తెలుస్తుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విద్యుత్ అజ్మల్ విలన్ గా నటించాడు. ఈమధ్య కాలం లో ఎక్కువ గా హీరో క్యారెక్టర్స్ పై ఫోకస్ పెట్టిన విద్యుత్ అజ్మల్ చాలా కాలం తర్వాత విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. అదే విధంగా మలయాళం స్టార్ హీరో బిజూ మీనన్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే ట్రైలర్ ని చూస్తుంటే హీరో కి ఎదో మానసిక ఇబ్బంది ఉన్నట్టుగా అనిపిస్తుంది. గజినీ షేడ్స్ కూడా ఈ చిత్రం లో ఉన్నాయి. ఓవరాల్ గా మురుగదాస్ ఈ చిత్రం తో తన కసి మొత్తాన్ని చూపించబోతున్నాడు అనే సంకేతం ఆడియన్స్ లోకి వెళ్ళింది. ఈ సినిమా హిట్ అయితే శివ కార్తికేయన్ స్టార్ హీరోల లీగ్ లోకి, మురుగదాస్ మళ్ళీ పీక్ ఫార్మ్ లోకి రాబోతున్నారు అనుకోవచ్చు.
