MAA Elections 2021 Live:‘మా’ ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
‘మా’ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానెల్స్ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన శివబాలాజీపై ప్రకాష్ రాజ్ వర్గానికి చెందిన హేమ దాడి చేసినట్లు తెలిసింది. శివబాలాజీ చేయి కొరికినట్టు సమాచారం.
పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. ‘గొడవేమీ లేదు. అది చాలా చిన్నది.. ఎవరో ఒకరు ప్రకాష్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని.. నేను, ప్రకాష్ రాజ్ కౌగిలించుకున్నామని నరేశ్ తెలిపారు. శివబాలాజీని మాత్రం హేమ కొరికారని.. ఆ కొరికిన గుర్తులను మీడియాకు నరేశ్ చూపించాడు. దీంతో మా ఎన్నికల్లో రసాభాసగా మారింది.
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మా పోలింగ్ ను ఎన్నికల అధికారులు ఆపేసినట్లు సమాచారం. గందరగోళం నెలకొనడంతో ఆపినట్లు తెలిసింది.
వీడియో..