Homeఎంటర్టైన్మెంట్MAA Election: మోహన్​బాబు నన్ను కొట్టబోయారు అని చెబుతూ ఏడ్చేసిన బెనర్జీ

MAA Election: మోహన్​బాబు నన్ను కొట్టబోయారు అని చెబుతూ ఏడ్చేసిన బెనర్జీ

MAA Election: మా ఎన్నికల్లో ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​ నుంచి పోటీచేసిన వారంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భగా సినీ నటుడు బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జరిగిన విషయలపై స్పందించారు. తాను గెలిచినందుకు అందరూ అభినందనలు చెబుతున్నా.. సంతోషంగా లేనని అన్నారు. ఎన్నికల్లో దూరంగా నిలబడినట్లు పేర్కొన్నారు. ఓ వైపు మోహన్​బాబు తనీశ్​ను తిడుతుంటే… విష్ణు దగ్గరికి వెళ్లి గొడవలొద్దని సర్దిచెప్పినట్లు వివరించారు. అది విన్న మోహన్​బాబు తనను కొట్టడానికి వచ్చారని… అసభ్య పదజాలంతో తిట్టిపోశారని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు బెనర్జీ.

maa-election-actor-benarji-sensational-comments-on-mohanbabu

అదే సమయంలో తన పక్కనే ఉన్న విష్ణు తనను పక్కకు నెట్టి మోహన్​ బాబును అడ్డుకున్నారని చెప్పారు. మోహన్​బాబుకు వివాహం కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లమని.. ఇప్పుడు ఆయన అన్న మాటలకు షాక్​ అయ్యానని బాధపడ్డారు. వాళ్ల ఇంటికి వెళ్తే లక్ష్శీ, విష్ణులను ఎత్తుకొని తిరిగేవాడినని… అటువంటి నన్ను పట్టుకుని తిడుతుంటే తట్టుకోలేకక్ పోయానని అన్నారు.  విష్ణు, మనోజ్​ వచ్చి క్షమాపణ కోరుతూ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారని తెలిపారు.

నా తల్లిని తిడుతుంటే చాలా బాధేసిందని భవిష్యత్తులో కార్యవర్గ సమావేశం జరిగితే వారికి భయపడి మాట్లాడలేనని అందుకో రాజీనామా చేస్తున్నట్లు బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు. ఆ బాధ తోనే మూడు రోజుల నుంచి నిద్ర కూడా పోవట్లేదాని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే అంతకు ముందు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ…  మా ఎన్నికల్లో చాలా రౌడీయిజం చేశారని, నరేష్ ప్రవర్తన సరిగ్గా లదేని అన్నారు. సగం సగం కార్యవర్గం వలన ఉపయోగం ఉండదని… మా సంక్షేమం కోసం ఎంతో అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular