Lucky Bhaskar Vs Kubera Movie: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం రెండు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. సినిమాలో అడుగడుగునా శేఖర్ కమ్ముల మార్క్ కనపడింది అని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో అంతంత మాత్రం గానే ఉండడం బయ్యర్స్ కి కాస్త నిరాశ కలిగించే విషయం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ కి, గత ఏడాది లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ‘లక్కీ భాస్కర్’ స్టోరీ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
‘లక్కీ భాస్కర్’ చిత్రం లో హీరో తన ఇంట్లోని కష్టాలను అధిగమించేందుకు బ్యాంక్ డబ్బులను వాడుకొని పైకి వస్తాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో పెద్ద స్కాం లో చిక్కుకొని క్లైమాక్స్ లో తెలివిగా ఆ స్కాం నుండి బయటపడి బ్యాంక్ వాళ్ళని దొరికిపోయేలా చేస్తాడు. ‘కుబేర’ చిత్రం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మన అందరికీ తెలిసిందే కోట్లు సంపాదించే కోటీశ్వరులు అత్యధిక శాతం మంది టాక్సులు కట్టకుండా బ్లాక్ మనీ ని స్విస్ బ్యాంక్ లో దాచుకుంటూ ఉంటారు. దీనిని ఒక చార్టెడ్ అకౌంటెంట్ (అక్కినేని నాగార్జున) ఎలా అయినా తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ప్లాన్ తో ఒక ముగ్గురు బిచ్చగాళ్లను పట్టుకొని వాళ్ళ పేరిట స్విస్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ బ్లాక్ మనీ మొత్తం వీళ్ళ అకౌంట్ లోకి వేయించి, ఆ డబ్బులను కొట్టేయాలని చూస్తాడు. ఇద్దరు బిచ్చగాళ్ళు నాగార్జున వేసిన ప్లాన్ కి అనుకూలంగానే పని చేస్తారు.
Also Read: Nagarajuna Kubera Movie: నాగార్జున కుబేర మూవీ చేయడానికి అదొక్కటే కారణమా..?
కానీ మూడవ బిచ్చగాడు(ధనుష్) మాత్రం రివర్స్ గేమ్ ఆడి, ఆ డబ్బులతో పారిపోతాడు. ఆ తర్వాత నాగార్జున ఆ బిచ్చగాడి కోసం ఊరంతా వెతకడం, కోటీశ్వరుడు(విలన్) తన బ్లాక్ మనీ ని కొట్టేసినందుకు నాగార్జున ని,ఆయన కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ. క్లైమాక్స్ లో నాగార్జున తన తప్పుని తానూ తెలుసుకొని, ధనుష్ ని రక్షించి, తాను పోలీసులకు లొంగిపోయి,తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇది స్టోరీ. చూస్తుంటే లక్కీ భాస్కర్ చిత్రాన్ని స్కాం మీద బేస్ చేసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా అంతే. కానీ రెండు సినిమాల ప్రపంచాలు వేరు, కథ,స్క్రీన్ ప్లే కూడా వేరు, కేవలం ఆ థీమ్ లోనే ఈ చిత్రం కూడా ఉంటుంది అనేది ట్రైలర్ ని చూస్తేనే తెలుస్తుంది.