
LoveStory Theatrical Trailer Talk: ఈ సమాజంలో అన్నింటికంటే మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా..? ‘నిరుద్యోగం’. అవును.. ఉద్యోగాలు లేక.. ఉపాధి దొరకక ఎంతో మంది యువతి పార్ట్ టైం జాబుల వెంట పరిగెడుతూ అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి ఉద్యోగాల కోసం చకోర పక్షిలా తిరుగుతున్నారు. అలాంటి మేజర్ సబ్జెక్ట్ ను తీసుకొని ఇద్దరు నిరుద్యోగ యువతీ యువకుల కష్టాలు చూపిస్తూ వారి మధ్య ప్రేమ చిగురించి వారు పడిన కష్టాలు.. వాటిని ఎలా జయించారనే మంచి కాన్సెప్ట్ తో రూపొందిందే ‘లవ్ స్టోరీ’ మూవీ.
నాగచైతన్య(Naga chaitanya) హీరోగా.. సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘లవ్ స్టోరీ’(Love story). ఈ అద్భుత ప్రేమ కథా చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలానే తీర్చిదిద్దాడని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ టచ్ చేసేలా రూపొందించారు.
హైదరాబాద్ లో పార్ట్ టైంగా డ్యాన్స్ నేర్పిస్తూ ఉద్యోగాల కోసం సర్టిఫికెట్లు పట్టుకొని తిరిగే ఒక నిరుద్యోగిగా ‘నాగచైతన్య’ ఇందులో కనిపించాడు. ఊళ్లోని పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చుకుందామంటే అమ్మ అడ్డు చెప్పడం.. ఇటు ఉద్యోగం రాక రూమ్ రెంట్ కూడా చెల్లించకపోవడం.. డ్యాన్స్ చేస్తే అసలు డబ్బులు రాకపోవడంతో ఇక విసిగి వేసారి జీవితంపై విరక్తి చెందే యువకుడిగా నాగచైతన్య నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం విశేషం. కాస్త యాజ్ టీజ్ గా రాలేదని టీజర్ చూస్తే తెలుస్తోంది.
ఇక సాయిపల్లవిది అదే కథ.. బీటెక్ చదివి.. ఇంగ్లీష్ సరిగా రాక ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయిపోతున్న ఈమె హీరోకు దగ్గర అవుతుంది. సాయిపల్లవి డ్యాన్స్ కళను చూసి హీరో చైతూ ఎంకరేజ్ చేస్తాడు.. ఆ తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి డబ్బు సంపాదిస్తారు. ప్రేమలో పడుతారు. కానీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పడిన కష్టాలు.. ఎలా విజయతీరాలకు చేరారన్నది కాన్సెప్ట్ గా తెలుస్తోంది. మొత్తంగా ట్రైలర్ చూస్తే సామాన్యులకు టచ్ అయ్యే హృదయాన్ని హత్తుకునే సబ్జెక్ట్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 24న థియేటర్లో విడుదల చేస్తున్నారు.