Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.

కాగా ఈ చిత్రం లోని మొదటి పాట పేరు కళావతి అని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. చంద్రబోస్ రాసిన ఈ లవ్ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందట. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా రానున్న ఫస్ట్ సింగిల్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవల క్లారిటీ ఇచ్చింది.
Also Read: జగన్ తో మెగాస్టార్ మళ్ళీ భేటీ.. ఉపయోగం ఉంటుందా ?
ఈ మూవీ నుంచి మాస్ పాట వస్తుందని తొలుత అంతా భావించగా.. ప్రేమికుల దినోత్సవం రోజున రానుండటంతో లవ్ సాంగ్ అనే ప్రచారం జరుగుతోంది. త్వరలో ‘గోవా’ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. ముందుగా ఒక సాంగ్ ను షూట్ స్టార్ట్ చేస్తారట. కాగా ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు.

మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Also Read: ప్రపంచంలోనే అత్యధిక మంది తీసిన టాప్ 10 ప్రదేశాల ఫొటోలు ఇవే..