Lokesh Kanagaraj Universe: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు(Lokesh Kanaka Raj)…ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకొని చాలా తక్కువ రోజుల్లో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకులలో లోకేష్ కనకరాజు మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఏ స్టార్ డైరెక్టర్ ను చూసుకున్న ఒక్కో సినిమా కోసం దాదాపు రెండు, మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం ఒక్కసారి సినిమా సెట్స్ మీదకి వెళ్లిందంటే ఆరు నెలల్లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అలా రూపొందినవే కావడం విశేషం…మరి ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాల్లో డిఫరెంట్ కథలను చెబుతూ ప్రేక్షకులను మైమరిపింప చేస్తూ ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలోని లోకేష్ యూనివర్స్ అనేది పెట్టి అందులో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇంట్లో ఎన్ని సినిమాలు రాబోతున్నాయి.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ఎంతమంది హీరోలు ఉండబోతున్నారు. వీళ్ళందర్నీ ఎక్కడ కలుపబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కూలీ సినిమా తర్వాత ‘ఖైదీ 2’ సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఖైదీ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కార్తీ అద్భుతంగా నటించి మెప్పించాడు.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ ను చేసి దానిని కూడా సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగం కాబోతుందని చివర్లోనే తెలియజేశాడు.
ఇలా ఈ యూనివర్స్ లో ఉన్న హీరోలందరిని కలిపి ఒక సినిమాలో ఏకం చేసి వీళ్ళందరి చేత బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ప్రస్తుతం ఉన్న హీరోలందరు భాగమవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కూలీ సినిమాని కూడా లోకేష్ యూనివర్స్ లో భాగం చేయబోతున్నారా? లేదంటే ఈ సినిమాని సపరేట్ గా చేశారా అనేది తెలియాల్సి ఉంది…