Site icon OkTelugu

Lokesh Kanagaraj Favorite Hero: తెలుగులో లోకేష్ కనకరాజ్ ఫేవరేట్ హీరో అతనేనా..?

Lokesh Kanagaraj Favorite Hero

Lokesh Kanagaraj Favorite Hero

Lokesh Kanagaraj Favorite Hero: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత సంవత్సరం ఆయన రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన ఇమేజ్ మాత్రం తగ్గలేదు. కారణమేంటంటే ముందుగానే ఆయన భారీ మార్కెట్ ను కలిగివున్నాడు. కాబట్టి ప్రస్తుతం అదే మార్కెట్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ కి బాగా నచ్చిన హీరో ఎవరు అంటు సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజు ప్రభాస్ కి వీరాభిమాని అనే విషయం తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలన్ని చూస్తూ ఉంటాడట. అందువల్లే అతనితో సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకున్నప్పటికి ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల వర్కౌట్ కాలేదు.

ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా తప్పకుండా వస్తుందంటూ అటు ప్రభాస్ అభిమానులు, ఇటు లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ సైతం కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు లోకేష్ కనకరాజు చేసిన సినిమాల్లో విక్రమ్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కార్తీ తో చేసిన ‘ఖైదీ’ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

నిజానికి ఆ సినిమాతోనే పెను ఒక యూనివర్స్ ను క్రియేట్ చేయాలనే ఆలోచన లోకేష్ కనకరాజ్ కు రావడం దాన్ని చాలామంది దర్శకులు ఫాలో అవుతూ ముందుకు సాగడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం… ఇక లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ ను ఏ క్యారెక్టర్ లో చూపిస్తాడు. ఎలాంటి ఎలివేషన్స్ ను ఇస్తాడు. తన ఇమేజ్ ని పెంచేలా సినిమా చేస్తాడా లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానులైతే వ్యక్తమవుతున్నాయి…

Exit mobile version