బిగ్ బాస్ ఎట్టకేలకు నాలుగో వారానికి చేరుకుంది. చాలా రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఇటు ఆట పరంగా అటు కంటెంట్ పరంగా ది బెస్ట్ ఇస్తున్నారు. గడిచిన సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తమ పరిధి దాటి మరి ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ కూడా ఆడా మగా అని తేడా లేకుండా మగవాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

నిన్న (బుధవారం) జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాల చురుకుగా పార్టిసిపేట్ చేశారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరికి ఆకలి బాధ ఎలా ఉంటుందో ఈ టాస్క్ ద్వారా తెలియ చేసాడు బిగ్ బాస్. అంతే కాకుండా ఫుడ్ వాల్యూ తెలియచేస్తూ నటరాజ్ మాస్టర్, లోబో, విశ్వ, ప్రియా ఒక మంచి టాస్క్ ని పెర్ఫార్మ్ చేశారు.
ఇదిలా ఉండగా నిన్న జరిగిన ఎపిసోడ్లో లోబో ప్రవర్తన గుండెల్ని పిండేసే లా ఉంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఆకలి బాధ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు బిగ్ బాస్. మొ న్నటి నుంచి హౌస్‌లో ఉన్న ఎవరికీ ఫుడ్ లేకుండా చేసిన బిగ్ బాస్.. కేవలం బొండం నీళ్లు.. ప్రొటీన్స్ పౌడర్ మాత్రమే ఇచ్చారు. అయితే ఆకలిని తట్టుకోలేకపోయిన లోబో నిన్ననే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్‌ని తినేశాడు. అయితే నిన్న ఎపిసోడ్‌లో డస్ట్ బిన్‌లో పడేసిన ఫుడ్‌ని ఎవరికి కనిపించకుండా తీసుకోోవడానికి ప్రయత్నించాడు. అది చూసిన రవి.. పిచ్చి నా కొడుకు ఏం చేస్తున్నాడో చూడు అంటూ ఎమోషనల్ అయ్యాడు.