Chinni Krishna On Chiranjeevi: రచయిత చిన్న కృష్ణ కొంత కాలం కిందట మెగాస్టార్ చిరంజీవి పై నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటికి వెళ్తే కనీసం పిలిచి భోజనం పెట్టలేదంటూ చిరంజీవి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి. చిరంజీవి ఫ్యాన్స్ చిన్ని కృష్ణ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దుర్భాషలాడుతూ మాట్లాడిన చిన్ని కృష్ణ తాజాగా ఆ విషయాలపై స్పందిస్తూ పశ్చాత్తాప పడుతూనే చిరంజీవికి క్షమాపణలు తెలిపారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈయన పోస్టు చేసిన వీడియోలో చిరంజీవికి క్షమాపణలు చెప్పడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇక ఈ వీడియోలో చిన్ని కృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవి అన్నయ్యకు పద్మభూషణ్ వచ్చిందని విని చాలా సంతోషించాను. ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. అయితే ఈ భూమి మీద పుట్టిన అందరూ కొన్ని తప్పులు చేస్తారు. తప్పులు మాట్లాడతారు అనేది నగ్న సత్యం అన్నారు. అంతేకాదు నా మీద నమ్మకంతో పిలిచి ఇంద్ర సినిమాకు ఛాన్స్ ఇచ్చినా నోటికి వచ్చినట్లు మాట్లాడాను.
కొందరి వ్యక్తుల ప్రభావం, ఒత్తిడి వల్ల అన్నయ్యపై పలు వ్యాఖ్యలు చేశాను. దాని వల్ల నా భార్య పిల్లలు, చెల్లి, బావ, సమాజం, నా మిత్రులు నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు భగవంతుని ముందు, స్నేహితుల ముందు క్షమాపణ కోరుతూనే ఉన్నాను. నాలో నేనే పశ్చాత్తాపడుతున్నాను అని ఆవేదన చెందారు చిన్ని కృష్ణ. ఈ గొడవ జరిగిన దగ్గర నుంచి చిరు అన్నయ్య నాకు ఎదురుపడలేదని..ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసి ఇంటికి విష్ చేయడానికి వెళ్తే తనను రిసీవ్ చేసుకున్నారని తెలిపారు.
ఇక చిరంజీవి చేసిన మర్యాదలు, తన బాగోగులు అడిగిన విధానం చూసి తనలో తానే బాధ పడ్డారట. ఇలాంటి వ్యక్తిని నా నోటితో తప్పుగా మాట్లాడాను అంటూ క్షమించమని అడిగారట. పెద్ద మనసుతో క్షమించి, దగ్గరకు తీసుకొని ఏమైనా కథలు రాస్తున్నావా? అని ఆప్యాయంగా అడిగారని తెలిపారు. మంచితనంతో మాట్లాడడమే కాదు కలిసి పనిచేద్దాం మంచి కథ చూడు అన్నారట. అయితే ఈసారి ఆయనతో పని చేస్తే దేశం గర్వించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. అంతేకాదు మళ్లీ జన్మంటూ ఆయనకు సోదరుడిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని వీడియోలో పేర్కొన్నారు చిన్నికృష్ణ.