Little Hearts 10 Days Collections: ఈ ఏడాది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని కాపాడింది చిన్న సినిమాలే, భారీ ఆశలు పెట్టుకున్న పెద్ద సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇండస్ట్రీ ని ట్రేడ్ ని ఆర్ధిక సంక్షోభం లోకి నెట్టాయి. బయ్యర్స్ చేతుల్లో మనీ రొటేషన్ లేక ఇబ్బంది పడుతున్న సమయం చిన్న సినిమాలే వాళ్ళ జీవితాలను కాపాడాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie). ప్రముఖ యూట్యూబర్ మౌళి(Mouli Talks) హీరో గా నటించిన ఈ సినిమా చప్పుడు చేయకుండా థియేటర్స్ లో విడుదలై ప్రీమియర్ షోస్ నుండే ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఫలితంగా వసూళ్లు రోజు రోజుకి పెరుగుతూ వెళ్లాయి. కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 10 రోజుల్లో 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
షేర్ వసూళ్లు దాదాపుగా 16 కోట్ల 86 లక్షల రూపాయిల వరకు ఉండొచ్చు. నిన్న కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ఈ ఏడాది నాన్ స్టాప్ గా 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిల్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో 5 కోట్ల 43 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ నుండి కోటి 3 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘వార్ 2’ తెలుగు వెర్షన్ నార్త్ అమెరికా కలెక్షన్స్ కంటే ఈ సినిమాకే ఎక్కువ వచ్చాయని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. అంతే కాదు రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలు ఈ చిత్రం పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు వెయ్యి కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తాయని, ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు