Chiranjeevi: చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈయన ఇంతకు ముందు చేసిన భోళా శంకర్ సినిమా నిరాశపర్చడం తో, ఇప్పుడు విశ్వంభర తో మాత్రం ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.
అయితే చిరంజీవి గత 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక అలాగే తన కొడుకు అయిన రామ్ చరణ్ కూడా మెగాస్టార్ రేంజ్ హీరో కావాలని చిరంజీవి భావించాడు. అందుకే చిరంజీవి రామ్ చరణ్ చేత చాలా హార్డ్ వర్క్ చేయించాడు. ఇక మొదట్లో కొన్ని సందర్భాల్లో రామ్ చరణ్ ప్లాప్ సినిమాలు చేసినప్పటికీ, ఆ తర్వాత వైవిధ్యమైన కథంశాలను ఎంచుకొని వాటిని సినిమాలుగా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించమని చిరంజీవి చరణ్ కి చెప్పడట. దానివల్లే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియాలో ఉన్న చాలామంది అభిమానులు చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలోనే ది బెస్ట్ ఆర్టిస్టులుగా పేరుపొందిన ఏ ఒక్క నటుడు కూడా తమ కొడుకులను స్టార్ హీరో అనే రేంజ్ కు తీసుకెళ్లలేకపోయాడు. కేవలం చిరంజీవి మాత్రమే రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా మార్చాడు అని, అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా కూడా మార్చుకున్నాడని చాలామంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
ఇక ముఖ్యంగా బాలీవుడ్ బిగ్ బి అయిన అమితాబచ్చన్ తన కొడుకు అయిన అభిషేక్ బచ్చన్ ను గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ, అభిషేక్ బచ్చన్ మాత్రం సక్సెస్ లను అందుకోవడంలో కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. అలాగే అమితాబచ్చన్ కి ఉన్న క్రేజ్ అభిషేక్ బచ్చన్ కి లేదు. అందుకే ఒక హీరో తన కొడుకుని కూడా స్టార్ హీరోగా మార్చాలి అనేది చాలా కష్టం తో కూడుకున్న పని కానీ ఆ విషయంలో చిరంజీవి మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…