Lenin Movie : అక్కినేని నాగ చైతన్య ‘లెనిన్’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో , అక్కినేని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ. మేకర్స్ ఈ చిత్రానికి మొదటి రోజున 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు కానీ , ట్రేడ్ విశ్లేషకుల లెక్క ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లు కేవలం 13 కోట్ల గ్రాస్ మాత్రమే. ఇది బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అయితే రెండవ రోజు ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి మెంటలెక్కిపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 18 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఒక మీడియం రేంజ్ హీరో కి ఈ రేంజ్ టిక్కెట్లు అమ్ముడుపోవడం , అది కూడా పదేళ్ల నుండి సరైన సూపర్ హిట్ లేకుండా అంటే మామూలు విషయం కాదు. అక్కినేని ఫ్యాన్ బేస్ ఎంత స్ట్రాంగ్ అనేది దీనిని బట్టే చెప్పొచ్చు. హైదరాబాద్ సిటీ లో టిక్కెట్ ముక్క దొరికితే ఒట్టు. ఈ రేంజ్ సునామీ ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకే చూశాము . మొదటి సారి ఒక మీడియం రేంజ్ హీరోకి ఇప్పుడు చూస్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి రెండవ రోజున 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ వసూళ్లు 8 నుండి 9 కోట్ల మధ్యలో ఉండొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. నైజాం ప్రాంతం లో కూడా ఇదే రేంజ్ ట్రెండ్ ని చూపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు , కర్ణాటక లో కూడా ఇదే పరిస్థితి. మొదటి రోజు కంటే రెండవ రోజు వసూళ్లు చాలా ఎక్కువ ఉన్నాయని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. విడుదలకు ముందు ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 2 రోజులకు కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 3 వ రోజున పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ అవ్వనుంది. ఇక ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
