Pan India Star: మన సినిమాలో విషయం ఉందని జనాలకు తెలిపేవి ప్రమోషన్స్. ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా ప్రేక్షకులకు చేరాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. సినిమా వ్యాపార సూత్రాలు మారిపోగా ఓపెనింగ్స్ ద్వారానే 70 నుండి 80 శాతం పెట్టుబడి రాబట్టాలి. అలా జరగాలంటే భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించాలి.

20 రోజుల వ్యవధిలో టాలీవుడ్ నుండి రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. డిసెంబర్ 17న పుష్ప, జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు చిత్రాల ప్రమోషన్స్ ని పరిశీలిస్తే ఆర్ఆర్ఆర్ ఎక్కడో ఉంది. పుష్ప మూవీ కంటే వెనుక రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రమోషన్స్ విషయంలో జోరు చూపిస్తున్నారు. ముంబైలో హిందీ ట్రైలర్ విడుదల చేసిన ఆర్ఆర్ఆర్ టీం అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఆ తర్వాత హైదరాబాద్ తో పాటు చెన్నై, బెంగుళూరు నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహించి ఇతర భాషలలో కూడా ఆర్ఆర్ఆర్ కి భారీ ఓపెనింగ్స్ దక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోయిన్ అలియా భట్ లు విధిగా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అలాగే ప్రధాన నగరాల్లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించనున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. రాజమౌళి దర్శకుడు కావడంతో ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ నెలకొని ఉంది. అయినప్పటికీ విరివిగా ప్రమోషన్స్ చేపడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తో పోల్చుకుంటే పుష్ప మూవీకి అంత హైప్ లేదు. తెలుగులో తప్పితే మిగతా భాషల్లో ఈ మూవీపై ఆసక్తి లేదు. నార్త్ ప్రేక్షకులకు హీరో బన్నీ గురించి గానీ, దర్శకుడు సుకుమార్ గురించి గానీ తెలిసింది చాలా తక్కువ. కాబట్టి ఇతర భాషల్లో సినిమాకు భారీ ప్రచారం ఏర్పడేలా ప్రమోషన్స్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ పుష్ప టీమ్ ఆ విషయంలో చాలా వెనుకబడి ఉంది.
Also Read: సాలిడ్ ప్రమోషన్స్‌కు పుష్ప సిద్ధం.. ట్విట్‌తో ఆసక్తి పెంచిన టీమ్
అసలు హిందీ వర్షన్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ కాగా.. అక్కడ ప్రమోషన్స్ విషయంలో జీరో అని చెప్పాలి. ఏదో మొక్కుబడిగా ట్రైలర్ హీరో అజయ్ దేవ్ గణ్ చేతుల మీదుగా సోషల్ మీడియాలో విడుదల చేయించారు. సౌత్ లో ఇతర భాషలలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరో ఐదు రోజుల్లో చిత్ర విడుదల ఉండగా… ప్రమోషన్స్ నిర్వహణ సరిగా లేదు.
ఇది పుష్ప ఓపెనింగ్స్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కలదు. బన్నీ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ విషయంలో ఇంత అలసత్వం పనికిరాదని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Also Read: సరికొత్త ట్రెండింగ్ సృష్టిస్తోన్న ఊ అంటావా మావ.. పుష్ప పూనకాలే అంటున్న అభిమానులు