Baladitya Remuneration: నటుడు బాల ఆదిత్య ఎలిమినేషన్ నుండి ప్రేక్షకులు ఇంకా కోలుకోలేదు. హోస్ట్ నాగార్జున బాల ఆదిత్యకు నేరుగా ఉద్వాసన పలికాడు. నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉండగా శనివారం బాల ఆదిత్య నువ్వు ఎలిమినేట్ అయ్యావు, నీకోసం వేదికపై ఎదురుచూస్తూ ఉంటా వచ్చేయ్ అన్నాడు. సినిమా హీరోగా బాల ఆదిత్య టాప్ సెలబ్రిటీ హోదాలో ఇంట్లోకి వెళ్లారు. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే బాల ఆదిత్య ఫేమ్, గుర్తింపు పరంగా కూడా ఎక్కడో ఉన్నాడు. మరీ బ్యాడ్ ప్లేయరా అంటే… అదీ కాదు. అతి మంచితనం బాల ఆదిత్య మైనస్. టాస్క్, గేమ్స్ లో 100 శాతం ఎఫర్ట్స్ పెడతాడు.

సిగరెట్ కోసం గీతూని కొన్ని మాటలు అన్నాడనే ఆరోపణ వినిపిస్తుంది. బాల ఆదిత్యతో పోల్చుకుంటే రేవంత్, ఇనయాతో పాటు చాలా మంది అనరాని మాటలు అన్నారు. ఏది ఏమైనా బాల ఆదిత్య ఎలిమినేషన్ కి కారణాలు వెతకడం అనవసరం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నో రూల్స్, నో రెగ్యులేషన్స్. ఒకసారి ఎందుకు రూల్స్ అతిక్రమించావని తిడతారు. మరోసారి ఎందుకు రూల్స్ పాటించావని తిడతారు.
చేపల టాస్క్ లో సంచాలక్ గా ఉన్న గీతూ అక్కడున్న రూల్స్ కాకుండా తన రూల్స్ పెట్టిందని నాగార్జున కోప్పడ్డాడు. అదే పని రేవంత్ చేస్తే మెచ్చుకున్నాడు. గీతూ రేవంత్ చెప్పిన కారణం కూడా ఒకటే… ఆటను రసవత్తరంగా మార్చడం కోసం చేశామన్నారు. ఇక్కడ గీతూది తప్పైతే రేవంత్ ది కూడా తప్పే. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో రూల్స్ నిర్వాహకులకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి.

ఆ విషయం పక్కన పెడితే 10 వారాలు హౌస్లో ఉన్న బాల ఆదిత్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. దీని పై టాలీవుడ్ లో చర్చ మొదలు కాగా… ఒక ఫిగర్ బయటకు వచ్చింది. బాల ఆదిత్య టాప్ సెలబ్రిటీ కాబట్టి వారానికి రూ. 65 వేలు ఒప్పందంపై హౌస్లోకి వెళ్లారట. ఆ లెక్కన పది వారాలకు రూ. 6.5 లక్షలు పారితోషికంగా తీసుకున్నారట. బాల ఆదిత్యతో పాటు ఎలిమినేటైన వాసంతి మూడు లక్షల లోపే అందుకున్నట్లు వినికిడి. ఆమెకు చెప్పుకోదగ్గ గుర్తింపు లేని క్రమంలో వారానికి రూ. 25 వేలు నుండి 30 వేల ఒప్పందంపై లోపలి వెళ్లారట.