Lavanya Tripathi Marriage With Varun Tej: మెగా ఫామిలీ నుండి వచ్చిన మరో సక్సెస్ ఫుల్ హీరో నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్..ముకుంద సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా వరుణ్ తేజ్ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తన అద్భుతమైన నటన తో మంచి క్రేజ్ మరియు మార్కెట్ ని సంపాదించుకున్నాడు..కాంట్రవర్సీలకు ఎప్పుడు దూరంగా ఉండే వరుణ్ తేజ్ పై కూడా గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నాడని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి..అయితే ఈ వార్తలపై అటు లావణ్య త్రిపాఠి కానీ ఇటు వరుణ్ తేజ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..దానికి తోడు లావణ్య త్రిపాఠి మెగా ఫామిలీ కి సంబంధించిన ప్రతి కుటుంబ ఫంక్షన్ లో కూడా హాజరు కావడం..ఆ ఫోటోలు సోషల్ మీడియా లో రావడం తో వీళ్లిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారు ఏమో అని అభిమానులు సైతం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read:Pakka Commercial Collections: బాక్సాఫీస్ కే షాక్.. ఇది నిజంగా షాకింగే
అయితే ఇటీవల లావణ్య త్రిపాఠి ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడగకముందే ఈ విషయం పై ప్రస్తావించింది..ఆమె మాట్లాడుతూ ‘ సోషల్ మీడియా లో నేను వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్టు..త్వరలోనే ఆయనని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇలా చాలా వార్తలు వచ్చాయి..కానీ అదిపూర్తిగా అవాస్తవం..నేను వరుణ్ తేజ్ చాల మంచి బెస్ట్ ఫ్రెండ్స్..వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక నేను రోజు కలిసి జిమ్ కి వెళ్తుంటాం..నాకు వాళ్ళ ఫామిలీ తో మంచి రిలేషన్ ఉంది..అంతే కానీ ప్రేమ, పెళ్లి లాంటివి ఏమి లేవు..అసలు నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే లేదు..నాకు చేతినిండా సినిమాలు ఉన్నాయి..ప్రస్తుతం అవి చేసుకుంటూ నా కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని మాత్రమే ఉంది..ఒక్కవేల పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి..ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన హ్యాపీ బర్త్డే సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఆమె ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది..మత్తువదలరా సినిమా దర్శకుడు నితీష్ రానా తెరకెక్కించిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: L B Sriram: హిట్లర్ సినిమా ఎల్బీ శ్రీరామ్ కెరీర్ ను అడ్డుకుందా?