Lavanya Tripathi: సినిమా వాళ్లకు ఒక ఆనవాయితీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఏ జోనర్ లో అయితే భారీ హిట్ వస్తోందో.. ఇక మిగిలిన వాళ్ళంతా ఆ జోనర్ మీదే పడతారు. ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఈ క్రమంలో వచ్చిన ‘రెక్కీ’ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయి హిట్ అయింది. దాంతో సినిమా వాళ్ళ చూపులు అన్నీ ఇప్పుడు ఓటీటీల వైపు, వెబ్ సిరీస్ ల వైపు పడింది. సీనియర్ హీరోలు చాలామందికి థియేటర్ బిజినెస్ లేదు. వాళ్లకు ఓటీటీలోనే భవిష్యత్తు కనిపిస్తుంది.

అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి. అందుకే, స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే.. ‘రెక్కీ’ అనే చిన్న సిరీస్ లో శివ బాలాజీ పాత్ర బాగుంది. ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. అందుకే, రెక్కీ 2 రాబోతుంది. ఈ సిరీస్ లో క్రేజీ హీరోయిన్ నటించబోతుంది. ఆమె.. లావణ్య త్రిపాఠి. త్వరలోనే మొదలు కానున్న ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ గా నటించనుంది.
Also Read: Director Hari: తెలుగు సినిమా చేస్తోన్న తమిళ స్టార్ డైరెక్టర్
ఈ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తోన్న ‘ లావణ్య త్రిపాఠి’ పోలీస్ అధికారిణిగానే కనిపించబోతుంది. మొత్తానికి లావణ్య త్రిపాఠి కూడా సమంతను ఫాలో అవుతూ వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది. ప్రస్తుతం హోమ్లీ గర్ల్ లావణ్య త్రిపాఠి ఛాన్స్ లు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. నిజానికి స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చాన్స్ లు కావాలని తెగ ఆశ పడుతుంది లావణ్య. ‘అయినా నాకేం తక్కువా, నాకెందుకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వరు’ అని బాధ పడుతుంది కూడా.

మరి లావణ్య అడిగిన దానిలో కూడా పాయింట్ ఉంది కదా. లావణ్యకి ఏమి తక్కువ, ఆ మాటకొస్తే.. చాలామంది హీరోయిన్స్ కంటే లావణ్య అన్నిటిలో ఎక్కువే. అందుకే, లావణ్య ఇక సైలెంట్ గా ఉండాలనుకోవడం లేదట. ఎలాగైనా ఛాన్స్ లను అందుకోవాలని తెగ ప్రయత్నం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. కానీ చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు. అందుకే.. ఆమె ఓటీటీల వైపు కూడా చూస్తోంది.
పైగా తన కెరీర్ ను మరో మూడేళ్ల నుంచి నాలుగేళ్లు మాత్రమే ప్లాన్ చేసుకున్నానని, ఆ తర్వాత నటించే ఉద్దేశం లేదని లావణ్య చెబుతుందట. అయినా కొత్తగా ప్లాన్ చేసుకునేది ఏముంది ? మరో నాలుగేళ్లు అంటే.. లావణ్యకి 35 వస్తాయి. ఇక అప్పుడు ఈ ముదురు భామను ఎవరు మాత్రం హీరోయిన్ గా పెట్టుకుంటారు. అందుకే తెలివిగా ఇలా వెబ్ సిరీస్ లు చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
[…] Also Read: Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వాటికీ కూడా ఒప… […]
[…] Also Read: Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వాటికీ కూడా ఒప… […]
[…] Also Read:Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వాటికీ కూడా ఒప… […]