Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లేటెస్ట్ జబర్దస్త్ స్కిట్ యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తుంది. రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. పుష్ప స్పూఫ్ గా తెరకెక్కిన నేపథ్యంలో స్కిట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. దేశం మొత్తం పుష్ప మేనియాతో ఊగిపోతుండగా జబర్దస్త్ కమెడియన్స్ సైతం పుష్ప చిత్రంపై స్కిట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ షో టాప్ టీమ్స్ లో ఒకటిగా ఉన్న సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప స్పూఫ్ చేశారు. ఈ స్కిట్ లో సుధీర్ అల్లు అర్జున్ పుష్ప గెటప్ వేయగా, గెటప్ శ్రీను ఫహాద్ ఫాజిల్ చేసిన భన్వర్ లాల్ షెకావత్ గా, రామ్ ప్రసాద్ కేశవ గెటప్ వేయడం జరిగింది.

నాన్ స్టాప్ పంచ్ లతో సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను అల్లాడించారు. ఎపిసోడ్ హైలెట్ గా నిలిచిన పుష్ప స్కిట్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంది. కేవలం ఆరు రోజుల్లో సుడిగాలి సుధీర్ స్కిట్ 10 మిలియన్ వ్యూస్ దాటేసింది. వారం వ్యవధిలో కోటి వ్యూస్ దాటిపోవడం నయా రికార్డని చెప్పాలి. హైపర్ ఆది సైతం పుష్ప స్పూఫ్ స్కిట్ చేశారు. హైపర్ ఆది స్కిట్ 12 మిలియన్ దాటేయడం విశేషం. పుష్ప గెటప్ లో ఆది వేసిన పంచులు దుమ్ము రేపాయి. పుష్ప చిత్రం క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరికీ ఎక్కేసింది. క్రికెట్ సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు పుష్ప మేనరిజం ఫాలో అవుతున్నారు.
Also Read: రెడ్ వైన్ తాగితే కరోనా సోకే ఛాన్స్ తక్కువ.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే?
పుష్ప హిందీ లో సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హోదా దక్కినట్లే. హిందీ వెర్షన్ అనూహ్య విజయం సాధించగా అక్కడ ఆయనకు మార్కెట్ ఏర్పడింది. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించగా సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్ 2 భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీర్చిదిద్ధనున్నట్లు సమాచారం.

దర్శకుడు సుకుమార్ రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా… దేవిశ్రీ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. ఇక పుష్ప విజయం నేపథ్యంలో అల్లు అర్జున్ తో మూవీ చేయడానికి స్టార్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. ఇకపై అల్లు అర్జున్ నుండి రానున్న చిత్రాలన్నీ భారీ స్థాయిలో ఉండనున్నాయి. బన్నీ రెమ్యూనరేషన్ సైతం విపరీతంగా పెంచేశారట.
Also Read: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్ !
జబర్దస్త్ కు గుడ్ బై | Sudigali Sudheer Sensational Decision
[…] Also Read: పుష్ప స్పూఫ్… యూట్యూబ్ రికార్డ్స్ బద… […]