Malavika Mohanan: క్రేజీ ముద్దుగుమ్మ ‘మాళవిక మోహన్’ ప్రైవేట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే, వైరల్ అవుతున్న ఆ ఫేక్ ఫొటో పై నటి మాళవిక మోహనన్ స్పందించింది. తాను కొన్ని నెలల క్రితం ట్విటర్ లో పోస్టు చేసిన ఫొటోను ఎవరో అసభ్యకరంగా మార్ఫ్ చేసి సర్క్యూలేట్ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే, ఆ ఫోటోను కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచారం చేయడం దారుణమని ఆమె చెప్పింది. ఎవరికైనా ఆ ఫేక్ ఫొటో కనిపిస్తే రిపోర్టు కొట్టాలని ఆమె వేడుకొంది. మొత్తానికి ఆ ఫేక్ ఫోటో నాది కాదు అంటూ మాళవిక తాజాగా క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ఫోటో మాళవిక మోహన్ దే అంటూ నెటిజన్లు కూడా దాన్ని బాగా షేర్ చేశారు.
Also Read: జనసంద్రమైన విజయవాడ.. అండర్‌గ్రౌండ్‌లోకి ఉద్యోగసంఘాల నేతలు
అయినా ఇలాంటి విషయాల్లో కాస్త ముందుగానే రియాక్ట్ అవ్వాలి. కానీ పాపం మాళవిక అంతా అయిపోయాక కూల్ గా చిలకపలుకులు పలికితే ఉపయోగం ఉండదు. ఇక నుంచి అయినా ఆమె జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర ఉందట. అయితే, ఆ పాత్రలో మాళవిక మోహన్ తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ఆమెకు ఈ సినిమా ఆఫర్ వస్తే.. ఇక ఆమెకు తిరుగులేదు. ఎన్టీఆర్ సినిమా అంటే.. కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. కాబట్టి.. ఈ సినిమాలో ఛాన్స్ కోసం ఆమె కూడా కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: పవన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు..? కారణమేంటి?
[…] Also Read: అంతా అయిపోయాక చిలకపలుకులు పలికితే ఎ… […]