Lata Mangeshkar: భారత్ లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన రెండుమూడ్రోజులుగా దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు నెలకొనడంతో ప్రతీఒక్కరూ ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనాతోపాటు ఒమ్రికాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటంతో వైద్య సిబ్బందిపై అధిక పని భారం పడుతోంది. ఈక్రమంలోనే ప్రతీఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవాలని, వీలైనంత వరకు జన సముదాయాల్లోకి వెళ్లొద్దని, పెళ్లిళ్లు, విందులు, వినోదాలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
Also Read: ‘సుకుమార్’కి ఉన్న ఈ రికార్డ్స్ మరో దర్శకుడికి లేవు !
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పాక్షిక లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూ వంటి చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళనను రేపుతోంది. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకడంతో ఆయన తన అన్న రమేష్ బాబు అంత్యక్రియలకు సైతం దూరంగా ఉండాల్సిన దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. హీరోయిన్ త్రిష, బాహుబలి కట్టప్ప సత్యరాజ్, నటుడు రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, నటి శోభన, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, కొడుకు అకీరానందన్ సైతం కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా హోం ఐసోలేషన్లోకి వెళ్లారు.
తాజాగా ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, ఇండియన్ నైటింగల్ లతా మంగేష్కర్(92) కరోనా బారిన పడటం ఆందోళనను రేపుతోంది. వయస్సు పైబడిన వారిపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉందనిలతా మంగేష్కర్ మేడకోడలు రచన ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ దాదాపు 50వేల పాటలకు పైగా అలరించారు.
Legendary singer Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid-19. She has mild symptoms: Her niece Rachna confirms to ANI
(file photo) pic.twitter.com/8DR3P0qbIR
— ANI (@ANI) January 11, 2022