https://oktelugu.com/

Adipurush Promotions: ఉచితంగా లక్ష టిక్కెట్లు..’ఆదిపురుష్’ ప్రొమోషన్స్ వర్కౌట్ అవుతుందా ?

ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపు టికెట్ రేట్స్ హైక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కనీవినీ ఎరుగని రీతిలో ఇలా కూడా ప్రమోట్ చెయ్యొచ్చా అనేంతలా చేస్తుంది. దేశ వ్యాప్తంగా అన్నీ చోట్ల ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ని అనాధ పిల్లల కోసం ఉచితంగా పంపిణీ చేస్తుంది మూవీ టీం.

Written By:
  • Vicky
  • , Updated On : June 13, 2023 / 12:11 PM IST

    Adipurush Promotions

    Follow us on

    Adipurush Promotions: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మూవీ టీం టికెట్ రేట్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అవి వచ్చేంత వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశం లేదు.

    ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపు టికెట్ రేట్స్ హైక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కనీవినీ ఎరుగని రీతిలో ఇలా కూడా ప్రమోట్ చెయ్యొచ్చా అనేంతలా చేస్తుంది. దేశ వ్యాప్తంగా అన్నీ చోట్ల ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ని అనాధ పిల్లల కోసం ఉచితంగా పంపిణీ చేస్తుంది మూవీ టీం.

    ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత తెలంగాణ ప్రాంతం లో అనాదశరణాలయాలకు , వృద్ధాశ్రమాలకు మరియు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా 10000 టికెట్స్ ని ఇస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రభాస్ కి అత్యంత సన్నిహితంగా ఉండే రణబీర్ కపూర్ , రామ్ చరణ్ ,అనన్య మరియు మంచు మనోజ్ వంటి వారు కూడా అనాధపిల్లలకు టికెట్స్ ఉచితంగా పంపిణీ చెయ్యడానికి ముందుకొచ్చారు. మరి కొంతమంది ప్రముఖ సెలెబ్రిటీలు కూడా ఉచితంగా టికెట్స్ అనడపిల్లలకోసం ఇవ్వనున్నారు. అలా దేశ వ్యాప్తంగా లక్షకి పైగా టిక్కెట్లు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారని, ఈ ఫ్రీ ప్రమోషన్ మూవీ పై జనాల్లో మరింత ఆసక్తి పెంచుతుందని అంటున్నారు.

    నార్త్ ఇండియా లో ఈ ప్రమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది. కేవలం హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇప్పటికే 7 కోట్ల రూపాయిలు దాటిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఊపు లో కొనసాగితే బాలీవుడ్ లో పఠాన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం డే 1 రికార్డుని నెలకొల్పిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.