Laila Movie: విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి, విడుదల తర్వాత మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని, వారం రోజులు కూడా పూర్తి కాకముందే థియేటర్స్ నుండి వెళ్లిపోయిన చిత్రం ‘లైలా'(Laila Movie). విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యినప్పటికీ ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటాయి. కానీ ‘లైలా’ చిత్రానికి ఓటీటీ లో కూడా అదే పరిస్థితి. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో విశ్వక్ సేన్ ని ట్యాగ్ చేసి బూతులు తిట్టేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడివి, ఇలా అయిపోతున్నావేంటి?, పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతావని అనుకుంటే మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలో కూడా ఉండేలా లేవంటూ మండిపడుతున్నారు.
రీసెంట్ గానే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలెట్టింది. మార్చి 7 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి ఇప్పటి వరకు కనీసం 8 లక్షల వ్యూస్ కూడా రాలేదట. అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సంస్థల్లో విడుదలైన 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంటాయి. అలాంటిది ఈ సినిమాకి మూడు రోజులు పూర్తయిన రాలేదంటే ఓటీటీ లో కూడా ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ ఎదో కొత్తగా తీయాలనే ప్రయత్నం చేసి, చెత్తగా తీసాడు. విశ్వక్ సేన్ కూడా ఇక మీదట చేయబోయే సినిమాలలో తన స్లాంగ్ మార్చుకోవాలి, ప్రతీ సినిమాలోనూ ఒకే యాక్టింగ్ చేస్తున్నాడు అంటూ నెటిజెన్స్ ఈ సినిమాని చూసిన తర్వాత కామెంట్స్ చేస్తునాన్రు.
ఇకపోతే విశ్వక్ సేన్ ని ఈ సినిమా చాలా గట్టిగానే డిస్టర్బ్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, విశ్వక్ సేన్ ఒప్పుకునే వాడు కాదు. కానీ ఈ సినిమాకు ఒప్పుకున్నాడు, ఒక పెద్ద బహిరంగ లేఖని విడుదల చేసాడు. ఇక మీదట తన సినిమాలు ఎలాంటి జానర్ లో తెరకెక్కిన అసభ్యత అనేది ఉండకుండా ఉండేలా చూసుకుంటానని ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులకు ప్రమాణం చేసాడు. ప్రస్తుతం ఆయన జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ KV దర్శకత్వం లో ‘ఫంకీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఆయన ఆశలన్నీ ఈ సినిమా మీదనే ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్ అయితే విశ్వక్ సేన్ బౌన్స్ బ్యాక్ అయ్యినట్టే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.