Kushi Collections: విజయ్ దేవరకొండ ఖుషి మూవీ అనూహ్య మలుపు తీసుకుంది. సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఖుషి చిత్రానికి ఈ ఫలితం ఊహించనిది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సమంత హీరోయిన్. మూవీ ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ కుమ్మేసింది. కొన్ని ఏరియాల్లో విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ నమోదైంది. దీంతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడని ఫ్యాన్స్ భావించారు. సంబరాలు చేసుకున్నారు.
ఈ ఆనందంలో విజయ్ దేవరకొండ ఒక కోటి రూపాయలు దానం కూడా చేసేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు అప్లై చేసుకుంటే… ఎంపికైన వారిలో 100 మందికి లక్ష చొప్పున రూ. 1 కోటి దానం చేస్తున్నట్లు చెప్పాడు. అంతా బాగానే ఉంది. వీకెండ్ ముగియగానే ఖుషి ఢమాల్ అంది. సోమవారం నుండి 80% వసూళ్లు పడిపోయాయి. ఇక 6వ రోజు ఖుషి వరల్డ్ వైడ్ నామమాత్రపు కలెక్షన్స్ రాబట్టింది. నైజాంలో రూ. 28 లక్షలు రాబట్టింది. ఏపీ/తెలంగాణాలలో కలిపి రూ. 47 లక్షల షేర్, 85 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఇక ఆరు రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో ఖుషి రూ. 23.19 కోట్ల షేర్, రూ. 38.25 కోట్ల గ్రాస్ అందుకుంది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 3.10 కోట్లు, ఇతర భాషల్లో రూ. 2.95 కోట్లు, ఓవర్సీస్ రూ. 8.45 కోట్ల షేర్ అందుకుంది. వరల్డ్ వైడ్ 6 రోజులకు ఖుషి రూ. 37.69 కోట్ల షేర్, 70.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఖుషి ప్రపంచవ్యాప్తంగా రూ. 52.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 53.5 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఖుషి హిట్ కావాలంటే మరో రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలి. ట్రెండ్ చూస్తే అది అసాధ్యం అనిపిస్తుంది. నేడు రెండు కొత్త చిత్రాలు విడుదలయ్యాయి. జవాన్ హిట్ టాక్ తెచ్చుకోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డీసెంట్ టాక్ అందుకుంది. కాబట్టి ఖుషి బాక్సాఫీస్ రన్ నేటితో ముగిసినట్లే. ఖుషి ప్లాప్ మూవీగా నిలిచిపోయింది.