Kuberaa Twitter Review: శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘కుబేర’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే అంచనాలు ఉండడం సహజం. పైగా ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాకు తోడు అవ్వడం మరింత ప్లస్ అయ్యింది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్రాన్స్ మ్యూజిక్ ఆడియన్స్ కి వేరే లెవెల్ లో కనెక్ట్ అయ్యింది. ఇలా విడుదలకు ముందు అన్నీ పాజిటివ్ గా అనిపించాయి. అందుకే ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు లో యావరేజ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం దంచి కొట్టేసింది. అటు నాగార్జున, ఇటు ధనుష్ కెరీర్స్ లో నెంబర్ 1 ప్రీమియర్ గ్రాసర్ గా నిల్చింది ఈ చిత్రం.
Also Read: కుబేర సినిమాలో నాగ్, ధనుష్ పాత్రలివే
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ ప్రీమియర్స్ షోస్ టాక్ ఎలా ఉందో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. కొంతమంది ఈ చిత్రాన్ని అద్భుతంగా ఉంది, ధనుష్ నటన అద్భుతం, నాగార్జున కుమ్మేసాడు, శేఖర్ కమ్ముల కెరీర్ బెస్ట్ అని అన్నారు. మరికొంత మంది అయితే సినిమా చాలా లెంగ్త్ ఉంది, చాలా సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించింది, కాస్త షార్ట్ రన్ టైం పెట్టి షార్ప్ స్క్రీన్ ప్లే పెట్టి ఉంటే బాగుండేది ఓవరాల్ గా పర్లేదు, బాగానే ఉంది అన్నట్టుగా చెప్పారు. కొంత మంది USA టాప్ రివ్యూయర్స్ అయితే సినిమా పర్లేదు బాగానే ఉంది కానీ, శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే బలమైన ఎమోషన్స్ ఈ చిత్రం లో మిస్ అయ్యింది అని అంటున్నారు. ఓవరాల్ గా ఓవర్సీస్ షోస్ నుండి ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ నడుస్తుంది, ఇండియా లో షోస్ మొదలయ్యాక అదే రేంజ్ టాక్ ఉంటుందో లేదో చూడాలి.
#Kuberaa is a watchable crime drama that has solid moments that work well in both halves, but, at the same time, is too lengthy with an uneven pace and a rushed pre-climax and climax sequence.⁰⁰First and foremost, Dhanush gives arguably his career-best performance. He is superb…
— Venky Reviews (@venkyreviews) June 20, 2025
ఇక ఈ చిత్రం లో ధనుష్ నటన పై సోషల్ మీడియా లో సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ఇలాంటి అద్భుతమైన నటన ఈమధ్య కాలం లో ఏ హీరో కూడా చెయ్యలేదని, కచ్చితంగా ధనుష్ ఈ చిత్రం తో మరోసారి నేషనల్ అవార్డు కొట్టేస్తాడని అంటున్నారు. ఇక అక్కినేని నాగార్జున కి కూడా చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారక్టర్ పడినట్టు గా అనిపించింది. తన పాత్రలో నాగార్జున ఇరగదీసాడు అని అంటున్నారు. కంప్లైంట్ ఏమిటంటే సినిమా మూడ్ స్లో స్క్రీన్ ప్లే ఉండడమే. కానీ లాంగ్ రన్ లో ఇలాంటివి కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఇండియా లో షోస్ మొదలయ్యాక ఈ సినిమా టాక్ మారుతుందా లేదా అనేది.
First half anta cheta ga undi ga ra Babu ️️
Dhanush acting ok , super em kaadu ippatidaka
Nag, rashmika #Kuberaa— Dhoola Starrr (@dhoola_starr143) June 20, 2025
#Kuberaa stands as a decent crime drama with engaging sequences spread across both halves. It delivers some gripping moments and an interesting setup, but the sluggish pacing and an overly stretched runtime hinder its overall impact. The hurried pre-climax and climax also leave… pic.twitter.com/sNTTGA9jHX
— KLAPBOARD (@klapboardpost) June 20, 2025
Excellent second half. There are many emotionally charged sequences and the screenplay is racy. This second half is the best work of Sekhar Kammula’s career.
Dhanush – TAKE A BOW! A knockout performance. He moves you to tears with his innocent portrayal and takes charge when…
— Sharat chandra (@Sharatsays2) June 20, 2025