Kuberaa Collection: నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ‘కుబేర'(Kubera Movie) చిత్రం మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సరైన హిట్ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ట్రేడ్ కి ఈ చిత్రం సరికొత్త ఆశలు చిగురించేలా చేసింది. సోషల్ మీడియా లో కానీ, బయట కానీ , ఎక్కడా కూడా ఈ చిత్రానికి నెగటివ్ టాక్ రాలేదు. కొంతమంది అద్భుతంగా ఉందని చెప్తుంటే, మరి కొంతమంది మాత్రం బాగుంది,పర్వాలేదు అని చెప్తున్నారు. అంతే కానీ ఈ సినిమా అసలు బాగాలేదు అని మాత్రం ఒక్కరు కూడా చెప్పడం లేదంటే టాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే కరువు కాలం, యావరేజ్ టాక్ వచ్చినా జనాలు బ్రహ్మరథం పట్టేలా ఉన్నారు, అలాంటిది ఈ రేంజ్ టాక్ వస్తే వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవరూ అంచనా వేయలేరు.
మొదటి రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా 3 లక్షల 40 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ ఏడాది లో సౌత్ మొత్తం మీద ఈ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయిన సినిమానే లేదు. అయితే వస్తున్న కలెక్షన్స్ మొత్తం అత్యధిక శాతం తెలుగు వెర్షన్ నుండే వస్తున్నాయి. తమిళ వెర్షన్ వసూళ్లు తెలుగు వెర్షన్ లో 50 శాతం కూడా లేదు. ఇది డైరెక్ట్ తెలుగు సినిమానే, కానీ ఎంతైనా ధనుష్(Dhanush) తమిళనాడు లో క్రేజ్ స్టార్ హీరో కదా,కనీస స్థాయి ఓపెనింగ్ అయినా ఆ ప్రాంతం నుండి రావాలి కదా?, కానీ రాలేదు, కేవలం 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. రెండవ రోజు కూడా ఇదే ట్రెండ్. తమిళనాడు ప్రాంతం లో యావరేజ్ గా వసూళ్లు వస్తుంటే, తెలుగు లో మాత్రం స్టడీ గా ఉన్నాయి.
తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే 40 కోట్ల రూపాయలకు పైగా తమిళనాడు నుండి గ్రాస్ వసూళ్లు రావాలి. ప్రస్తుతానికి రెండు రోజులకు కలిపి తమిళనాడు నుండి 10 కోట్ల గ్రాస్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. వీకెండ్ లోనే వసూళ్లు రాకుంటే ఇక వర్కింగ్ డేస్ లో వసూళ్లు ఎలా వస్తాయి?, పరిస్థితి చూస్తుంటే తమిళనాడు లో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యేలా అనిపిస్తుంది. కానీ తెలుగు వెర్షన్ లో మాత్రం మొదటి వీకెండ్ లోనే అత్యధిక శాతం సెంటర్స్ బ్రేక్ ఈవెన్ అవ్వబోతున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చింది. మొదటి రోజు 15 కోట్ల షేర్ వచ్చింది. వీకెండ్ లోపు 45 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా మొదటి వారంలోనే హిట్ ట్రాక్ లోకి రావొచ్చు.