Prabhas with Krithi Shetty: కృతిశెట్టి గట్టిగా నాలుగు సినిమాలు కూడా చేయలేదు. అప్పుడే అమ్మడు స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. నిజానికి ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ కి ముందే కృతిశెట్టి కోసం హీరోలు పోటీ పడ్డారు. మొత్తానికి కృతిశెట్టి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. పైగా కృతిశెట్టిలో ప్రతిభ, లౌక్యం ఉన్నాయి. అందుకే ‘కృతి శెట్టి’ తెలుగు తెరపై చాలా త్వరగా తనదైన ముద్ర వేసింది. ఆకర్షించే అందం, ఆకట్టుకునే నటన ఆమెను తెలుగు ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గర చేసింది.

అన్నిటికి మించి ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అయితే, తాజాగా కృతిశెట్టి కెరీర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లే సినిమా తగిలినట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కాకపోతే.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఆ ముగ్గురి హీరోయిన్స్ లో కృతిశెట్టి కూడా ఒకరు. ఆమె నటన ప్రభాస్ కి బాగా నచ్చింది అట. అందుకే, హీరోయిన్ గా ఆమెనే తీసుకోమని మారుతికి సూచించాడు. త్వరలోనే ఈ అప్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
నిజానికి “ఉప్పెన” సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు.. ఎందరో హీరోయిన్లు రెండో సినిమాతోనే తెరమరుగు అయ్యారు కాబట్టి.. కృతి శెట్టి కూడా మరుగు చాటుకి వెళ్లక తప్పదు అని టాక్ వినిపించింది. కారణం.. ఆమెలో హోమ్లీ నెస్ తప్ప, హాట్ నెస్ లేదు అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. కానీ కృతి రెండో సినిమాలో ఆమె చూపించిన హాట్ నెస్ కి మేకర్స్ కూడా షాక్ అయ్యారు.
అసలు గ్లామరస్ రోల్స్ లో.. ‘కృతి శెట్టి’ మెప్పిస్తుందా ? లేదా ? అన్న డౌట్స్ అన్నీ ’శ్యామ్ సింగ రాయ్’ సినిమా పటాపంచలు చేసింది. ఆ సినిమాలో కృతి శెట్టి విచ్చలవిడిగా రెచ్చిపోయింది. హాట్ హాట్ కిస్ లతో హీట్ పెంచే బెడ్ సీన్లతో అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్లి పోయింది. దెబ్బకు విమర్శకులు సైతం ఆమెపై ప్రశంసల వర్షం కురిపించక తప్పలేదు.

ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌తో ‘ది వారియర్’, నితిన్‌తో ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా ఆమె చేతులోకి వచ్చింది కాబట్టి.. కెరీర్ లో మరో మెట్టు ఎక్కినట్టే.
Also Read: ఎత్తరజెండా పాటను కూడా వదలని సజ్జనార్.. ఇలా వాడేశాడే
[…] Nazriya Nazim: నజ్రియా.. స్వచ్ఛమైన సహజమైన నటి. ‘రాజా-రాణి’ అనే ఒక తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన ఓ మలయాళ నటి. పైగా ఆ సినిమాలో ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్ర. అయితే ఏమి ? అద్భుతంగా నటించింది. పూర్తి పేరు ‘నజ్రియా నజీమ్’. ఆమె నటనను, అలాగే ఆమె పలికించిన హావభావాలను అంత తేలిగ్గా ఎవ్వరూ మరచిపోలేరు. […]
[…] […]
[…] […]
[…] Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది. రేపు రెండో పాట అనౌన్స్మెంట్ ఉంటుందని ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. […]