టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త తరం భామల హడావుడి ఎక్కువైపోయింది. ‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి కూడా ఈ లిస్టులో చేరి కెరీర్ లో సడెన్ గా స్టార్ డమ్ సంపాదించి రోజురోజుకూ పైపైకి దూసుకుపోతోంది. టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే, ఏకంగా రెండు మూడు సినిమాలలో ఛాన్స్ అందుకున్న ఈ క్రేజీ బ్యూటీ, ప్రెజెంట్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకటిగా వెలిగిపోతుంది.
హీరో రామ్ తో పాటు నాని సరసన ఆడిపాడనున్న కృతికి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం. ఎన్టీఆర్ – కొరటాల కలయికలో రానున్న సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ భామకు మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ దక్కడంతో ఇప్పుడు వస్తోన్న ఆఫర్స్ కూడా భారీగానే ఉంటున్నాయి. మొత్తానికి ఈ బ్యూటీ సింగిల్ సినిమాతోనే ఒక్కసారిగా హాట్ షాట్ హీరోయిన్ గా మారిపోయింది.
ఎలాగూ ఈ భామకు నటన విషయంలో మంచి మార్కులు పడ్డాయి. పైగా గ్లామర్ విషయంలో కూడా నూటికి నూట యాభై మార్కులు సాధించింది. అయితే సూపర్ హాట్ క్యారెక్టర్స్ కు సెట్ అవ్వకపోయినా.. తన హస్కీ హావభావాలతోనే యూత్ గుండెల్లో మంటలు పెట్టగలదు. అందుకే ఈ భామ గ్లామర్ ట్రెండ్ ను అందిపుచ్చుకోవడానికి ఒక సూపర్ హాట్ ఫోటో షూట్ చేయబోతుంది.
లైట్ గ్రే కలర్ లో డిఫరెంట్ పోజులతో ఆకర్షణీయంగా కనిపించడానికి వచ్చే వారం నుండి సన్నద్ధం అవ్వనుంది. ఈ ఫోటో షూట్ నేపథ్యం వెనుక ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఉన్నాడట. అతని డైరెక్షన్ లోనే ఈ చాక్లెట్ బేబీ ఫోటోలకు ఫోజులు ఇవ్వబోతుంది. ముఖ్యంగా కృతిలోని గ్లామర్ యాంగిల్ కి ఈ ఫోటో షూట్ తో పూర్తిగా గేట్లు ఓపెన్ చేయనున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Krithi shetty ready for hot photoshoot
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com