Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టిని ఓ స్టార్ హీరో కొడుకు వేధించాడట. ఆమెను ఇబ్బందులకు గురి చేశాడట. ఎప్పుడూ తన వెనుకబడుతూ అల్లరి చేశాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి స్వయంగా చెప్పారంటూ ఒక వార్త సంచలనం రేపుతోంది. ఈ వార్తలపై కృతి శెట్టి మౌనంగా ఉన్న నేపథ్యంలో నిజమే అని పలువురు భావించారు. ఆలస్యంగా ఈ కథనాలపై కృతి శెట్టి స్పందించారు. ఆమె ఈ పుకార్లను కొట్టిపారేశారు. అలాంటి సంఘటనే జరగలేదని వివరణ ఇచ్చారు.
ఈ రూమర్స్ ని తేలికగా తీసుకుందాం అనుకున్నాను. అయితే అంతకంతకూ ఇది వ్యాపిస్తుంది. దీంతో స్పందించక తప్పలేదు. నిరాధార పుకార్లు ఎవరు పుట్టిస్తారో అర్థం కావడం లేదు. నన్ను ఎవరూ వేధించలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి అంటూ విజ్ఞప్తి చేశారు.కృతి శెట్టి సోషల్ మీడియా మెసేజ్ వైరల్ అవుతుంది. దీంతో ప్రచారంలో ఉన్న ఒక వార్తపై స్పష్టత వచ్చింది.
మరోవైపు కృతి శెట్టి కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది. వరుస పరాజయాల నేపథ్యంలో కృతి శెట్టికి టైర్ టూ హీరోల పక్కనే ఛాన్సెస్ వస్తున్నాయి. ప్రస్తుతం మలయాళంలో ఒక మూవీ చేస్తున్న కృతి శెట్టి… శర్వానంద్ కి జంటగా ఓ మూవీ చేస్తున్నారు. తాజాగా జయం రవికి జంటగా జీనీ టైటిల్ తో మరో చిత్రం ప్రకటించారు. ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్ కృతి శెట్టి చేతిలో ఉన్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన కృతి శెట్టి ఉప్పెన మూవీతో హీరోయిన్ అయ్యింది. దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ఉప్పెన సెన్సేషనల్ హిట్ కొట్టింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనంతరం చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు విజయం సాధించడంతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. అయితే ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వరుసగా ప్లాప్ అయ్యాయి.
— KrithiShetty (@IamKrithiShetty) July 6, 2023