https://oktelugu.com/

సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయింది !

తెలుగువాళ్లకు సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అందుకే, సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయి. అలాగే ఈ సారి సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడ్డాయి. ఆ పోటీలో ‘క్రాక్’ యునానిమస్ హిట్ ‌గా నిలిచి.. మొత్తానికి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ అయింది. వరుస ఎలివేషన్ సీన్లతో గోపీచంద్ మలినేని, రవితేజను బాగానే […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 05:39 PM IST
    Follow us on


    తెలుగువాళ్లకు సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అందుకే, సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయి. అలాగే ఈ సారి సంక్రాంతికి మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు, ఒక తమిళ అనువాద చిత్రం పోటీ పడ్డాయి. ఆ పోటీలో ‘క్రాక్’ యునానిమస్ హిట్ ‌గా నిలిచి.. మొత్తానికి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ అయింది. వరుస ఎలివేషన్ సీన్లతో గోపీచంద్ మలినేని, రవితేజను బాగానే డీల్ చేశాడు. దాంతో ‘క్రాక్’ హిట్ టాక్ తెచ్చుకుంది.

    Also Read: అరె త్రిష పెళ్లి అట.. నిజమేనా !

    దీనికితోడు “మాస్టర్” సినిమాతో పాటు “రెడ్”, “అల్లుడు అదుర్స్” సినిమాలు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేక మొత్తానికి చేతులు ఎత్తేశాయి . అటు ప్రీమియర్ షోలలో అయినా, ఇటు మామూలు షోలలో అయినా ఈ సినిమాలకు కలెక్షన్స్ లో రావడం లేదు. ఇది క్రాక్ కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఆ సినిమాల టాక్ బ్యాడ్ గా ఉండటం, క్రాక్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండటం అలా క్రాక్ సూపర్ హిట్ అయి కూర్చింది. కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయట.

    Also Read: లైంగిక వేధింపుల గురించి మళ్ళీ చెప్పుకొచ్చింది !

    మొత్తం మీద ‘మాస్ మహారాజా’ రవితేజకు గోపీచంద్ మ‌లినేని భారీ హిట్ ఇచ్చాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌తో రవితేజ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. మరి రవితేజకు అలాంటి హిట్ ను ఇచ్చిన గోపీచంద్ మలినేనికి ఇప్పుడు మరో పెద్ద ఛాన్స్ కూడా వచ్చిందట. బాలయ్య బాబు తనకు సరిపోయే కథ ఉంటే చెప్పండి అంటూ గోపీచంద్ ను అడిగారట. మరి బాలయ్యకు గోపీచంద్ మలినేని ఎలాంటి కథ చెబుతాడో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్