Kotha Lokah Collection: లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఈమధ్య కాలం లో కొత్త తరహా కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘లోక'(Lokh Movie) అనే చిత్రం అందుకు ఉదాహరణ. మన తెలుగు లో ఈ చిత్రం ‘కొత్త లోక'(Kotha Lokah) అనే పేరుతో విడుదలైంది. కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ నెస్లేన్ హీరో గా నటించాడు. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిజంగా ప్రేక్షకులను కొత్త లోక లోకి తీసుకెళ్లింది. కేవలం 40 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వెండితెర పై చూస్తే 400 కోట్ల బడ్జెట్ కి అవసరమయ్యేంత క్వాలిటీ కనిపించింది. సాంకేతిక ప్రమాణాల విషయం లో ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలకు చెంప దెబ్బ లాగా నిల్చింది.
థియేటర్స్ లో విడుదలై 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారిగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాము. తెలుగు రాష్ట్రాలకు సంబందించిన థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత నాగవంశీ 3 కోట్ల రూపాయలకు సొంత చేసుకున్నాడు. పది రోజుల్లో 10 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 5 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా రెండు కోట్ల 25 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. కింగ్డమ్, వార్ 2 , రెట్రో వంటి వరుస హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో డీలాపడిన నాగవంశీ కి ఈ సినిమా కాస్త ఊరటని కలిగించింది. తెలుగు వెర్షన్ సంగతి పక్కన పెడితే మలయాళం మరియు ఇతర భాషలకు సంబంధించిన వసూళ్లు ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చాయో చూద్దాం పదండీ.
కేరళ రాష్ట్రంలో పది రోజులకు 51 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు నుండి 10 కోట్ల 65 లక్షలు, తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల 15 లక్షలు, కర్ణాటక రాష్ట్రం నుండి 8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్లు, ఓవర్సీస్ నుండి 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా పది రోజులకు 160 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 71 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, 200 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తుంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన హీరో గా నటించిన సినిమాలకు కూడా ఇప్పటి వరకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు అట. దీనిని బట్టీ ఈ చిత్రం వసూళ్లు సౌత్ లో ఎంత మంది స్టార్ హీరోల లేటెస్ట్ సినిమాల వసూళ్లకంటే ఎక్కువ అనేది ఊహించుకోండి.