Homeఎంటర్టైన్మెంట్Koratala Shiva: తారక్​ లేకుండానే కొరటాల షూటింగ్ ప్రారంభం!

Koratala Shiva: తారక్​ లేకుండానే కొరటాల షూటింగ్ ప్రారంభం!

Koratala Shiva: సెన్​షేషనల్ డైరెక్టర్​ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్యను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా రిలీజ్​ డేట్​ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాగా, ఈ సినిమా తర్వాత చిరు భోళాశంకర్​, గాడ్​ఫాదర్​ చిత్రాల్లో నటించనున్నారు. మరోవైపు, కొరటాల శివ కూడా ఎన్టీఆర్​తో మరో సూపర్​ హిట్​ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆచార్య సినిమా తర్వాత ఈ ప్రాజెక్టుపైనే శివ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Jr NTR

డిసెంబరులో ఎన్టీఆర్​తో షూటింగ్ మొదలుపెట్టాలని శివ భావించారు. అయితే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్​ చేతికి గాయం కావడం వల్ల ఈ ఏడాది చివర వరకు తారక్​ షూటింగ్​లో పాల్గొనలేనట్లు సమాచారం. ఈ క్రమంలోనే అప్పటి వరకు షూటింగ్​ ఆపకుండా మాస్టర్​ప్లాన్​ వేశారు శివ. ప్రస్తుతం ఎన్టీఆర్​పై తీసే సన్నివేశాలు కాకుండా.. ఇతర తారాగణంతో షూటింగ్​ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్​. మరోవైపు ఫిబ్రవరిలో ఆచార్య సినిమా విడుదల తేదీ ఉండటం వల్ల.. ప్రమోషన్స్​ కోసం కాస్త గ్యాప్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో షూటింగ్​ను కంటిన్యూ చేయనున్నారట. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలని కొరటాల ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్​చరణ్​కూడా కనిపించనున్నారు. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular