Agent: అఖిల్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అక్కినేని అఖిల్. అయితే ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను, హలో వంటి చిత్రాలు ఒక మోస్తరుగానే ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సూపర్ హిట్ అవ్వడంతో ఇదే రేసులో దూసుకుపోతున్నారు అఖిల్. తన నెక్స్ట్ మూవీ “ఏజెంట్ “కోసం తన పూర్తి లుక్ మరియు బాడీ ఆకృతిని మార్చారు. ప్రస్తుతం ఏజెంట్ షెడ్యూల్ లో బిజీ అయ్యారు. అఖిల్ అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ తెలిసింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం “ఏజెంట్”. ఈ సినిమా లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమాస్ పతాకాలపై రామబ్రంహం సుంకర, సురేందర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి యువ హీరో గా మరియు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన హిప్ హాప్ తమీజా ఆది సంగీత స్వరాలు అందిస్తున్నారు.
అయితే అక్టోబర్ నుంచి ఈ చిత్రం యూరప్ లో బుడాఫెస్ట్‌లో షెడ్యూల్ ప్రారంభించింది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన బుడాఫెస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను నెల్లూరులో కృష్ణపట్నం, విశాఖ పోర్ట్ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బృందం. బుడాఫెస్ట్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చింది.ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో చేయనున్నారు.