Koratala: ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ చిత్రానికి సంబంధించిన స్టోరీ పై అప్పుడే పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఈ కథ ఓ పాత సినిమా కథకు ఆధారం అట. ఇంతకీ ఆ పాత సినిమా ఏమిటో తెలియదు గానీ, కొరటాల మాత్రం పక్కా కాపీ కొట్టి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కొరటాలకు కాపీ కొట్టడం కొత్తేమి ఉంది ?

అసలు కొరటాల ప్రతి కథ, ఏదో కథకు ప్రతిరూపమే కదా. ఉదాహరణకు.. కొరటాల, మహేష్ బాబుతో చేసిన “భరత్ అనే నేను” సినిమా తీసుకుందాం. ఈ సినిమా కథ, “లీడర్” సినిమా కథకు కాపీ వెర్షనే. ఎందుకంటే లీడర్ సినిమా కాన్సెప్ట్ కి “భరత్ అనే నేను” సినిమా కాన్సెప్ట్ కి దగ్గర పోలికలు ఉంటాయి. మరి లీడర్ లాంటి క్లాసిక్ మూవీ ఉన్నా, అదే కాన్సెప్ట్ కాపీ చేసి తీసిన ‘భరత్ అనే నేను’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
కొరటాల కాన్సెప్ట్ లు కాపీ కొట్టినా ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడడు. లీడర్ క్లాసికే. కానీ రానాకి అది మొదటి సినిమా. మహేష్ ఆల్రెడీ పెద్ద ఇమేజ్ ఉన్న హీరో, ఇక డైరెక్టర్ గా కొరటాల శివ కూడా వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. పైగా కొరటాల ప్రతి సినిమాలో హీరో ఇమేజ్ బాగుంటుంది. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, పాటలు, ఫైట్లు లాంటివి కూడా కొరటాల చాలా చక్కగా ప్లాన్ చేస్తాడు.
Also Read: Radhe Shyam Movie: “సంచారి” అంటూ వచ్చేస్తున్న ప్రభాస్… రాధే శ్యామ్ నుంచి స్వీట్ న్యూస్
అన్నిటికి మించి లీడర్ లో హీరో పదవి కోసం చాలా పనులు చేస్తాడు, కానీ.. ‘భరత్ అనే నేను’లో ఆకస్మికంగా వచ్చిన పదవిని ఎంతవరకు బాగు చేయాలో అంత వరకు చేస్తాడు. ఇక రానా పదవి కోసం హీరోయిన్ ని వాడుకుంటాడు, కానీ.. మహేష్ హీరోయిన్ కోసం పదవిని వదిలేస్తాడు. చూశారా.. సేమ్ కథలో కొరటాల ఎంత హీరోయిజమ్ చూపించాడో.
అందుకే, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథాంశం కూడా.. ఏదో సినిమా నుంచి కాపీ కొట్టినా కొరటాల మాత్రం తన మార్క్ ను ఎలాగూ చూపిస్తాడు. కథ ముగింపు కూడా కొరటాల చాలా తెలివిగా ప్లాన్ చేస్తాడు. అందుకే కొరటాల కాపీ కొట్టినా ఇండస్ట్రీ హిట్ ఇస్తాడు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ తమిళంలో ఎలా మాట్లాడాడో తెలుసా? చూస్తే తట్టుకోలేరు?