https://oktelugu.com/

Vaishnav Tej: మెగా మేనల్లుడు కి ఊహించని నిరాశ… ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ?

Vaishnav Tej: మెగా స్టార్ మేనల్లుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో  వైష్ణవ్ తేజ్‌  పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మెగా బుల్లోడు తొలి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఉప్పెన లో విభిన్నమైన పాత్ర ఎంచుకొని తన నటన నైపుణ్యాన్ని…  కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. క్రిష్ దర్శకుడిగా తెరకెక్కిన కొండపొలం సినిమాలో నటించాడు వైష్ణవ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు… వైష్ణవ్  ఖాతాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 13, 2021 / 12:00 PM IST
    Follow us on

    Vaishnav Tej: మెగా స్టార్ మేనల్లుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో  వైష్ణవ్ తేజ్‌  పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మెగా బుల్లోడు తొలి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఉప్పెన లో విభిన్నమైన పాత్ర ఎంచుకొని తన నటన నైపుణ్యాన్ని…  కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

    క్రిష్ దర్శకుడిగా తెరకెక్కిన కొండపొలం సినిమాలో నటించాడు వైష్ణవ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు… వైష్ణవ్  ఖాతాలో ఇంకో సూపర్ హిట్ పడుతుంది అని అనుకున్నారు‌. కళ్ళతోనే  విభిన్న భావాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకోగలదు వైష్ణవ్. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కొండపొలం సినిమాను 45 రోజులు పూర్తి చేసినప్పటికీ థియేటర్స్ లో ఊహించనంత వసూళ్లు సాధించలేక పోయింది ఈ మూవీ.

    ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న … వసూళ్ల విషయంలో మాత్రం వెనుక పడిందని చెప్పాలి. మొదటి నాలుగు రోజులు  వచ్చినంత వసూళ్లు… ఆ తర్వాత రోజుల్లో సాధించలేక పోయింది ఈ సినిమా. తన మొదటి సినిమాకి 100 కోట్లులు తన ఖాతాలో వేసుకున్న ఈ మెగా మేనల్లుడు… తన రెండవ సినిమాకి మాత్రం అత్యధిక  వసూళ్లు రాబట్టడంలో తడబడ్డాడు.

    ఈ చిత్రంలో ఎం ఎం కీరవాణి స్వరపరిచిన  పాటలు ప్రేక్షకులను అలరించాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ గా…  తన పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. కోట శ్రీనివాస రావు తదితరులు ఈ సినిమాలో వాళ్ల వాళ్ల  పాత్రలకు న్యాయం చేశారు.  కానీ సినిమా ఊహించనంత విజయాన్ని దక్కించుకోలేకపోయిందని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.