Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser : సల్మాన్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. రొటీన్ చిత్రాలతో ఆయన తన ప్రాభవం కోల్పోయాడు. ఆయన గత చిత్రం రాధే డిజాస్టర్. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన రాధే కనీసం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. అంతిమ్ పేరుతో ఓ మూవీ చేశారు. అది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రతి రంజాన్ కి కొత్త మూవీని విడుదల చేసి హిట్ కొట్టడం సల్మాన్ కి అలవాటు. ఆ సెంటిమెంట్ ఆయనకు కలిసి వస్తుంది కూడా. కరోనా ఎంట్రీతో సల్మాన్ షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. ఈసారి రంజాన్ కి ఆయన పక్కా స్కెచ్ తో దిగుతున్నారు. ఫ్యామిలీ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీతో రంజాన్ బరిలో దిగుతున్నారు.
నేడు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘మంచోళ్ళకు మంచోడిని చెడ్డోళ్లకు చెడ్డోడిని’ అంటూ దుమ్మురేపే యాక్షన్ సీన్స్ తో సల్మాన్ ఎంట్రీ అదిరింది. ఆయన డిఫరెంట్ లుక్స్ ట్రై చేశారు. లాంగ్ హెయిర్ తో మాస్ లుక్, జెంటిల్ మాన్ గా మరో లుక్ లో కనిపించారు. రెండు నిమిషాల నిడివి కలిగిన టీజర్ ఫుల్ ప్యాక్ వలె ఉంది. మూవీలోని అన్ని పార్శ్వాలు పరిచయం చేశారు. లవ్, ఎమోషన్, యాక్షన్ కలగలిపి పక్కా కమర్షియల్ చిత్రంగా సిద్ధం చేశారు.
సల్మాన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా టీజర్ ఉంది. అయితే కొన్ని అంశాలు నిరాశపరిచాయి. వెంకీకి టీజర్ లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. భూమిక, పూజా హెగ్డే మధ్యలో వెంకీ నడిచి వస్తున్నట్లు ఓ షాట్ లో చూపించారు. భూమిక వెంకీ భార్య రోల్ చేస్తుండగా పూజా హెగ్డేది సిస్టర్ రోల్ అనే ప్రచారం జరుగుతుంది. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో వెంకీ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ గెటప్ చూశాక ఆయన ఎంపిక వెనుక ఆంతర్యం తెలిసింది. కథలో హీరో తెలుగు అమ్మాయిని లవ్ చేస్తాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పంచెకట్టు, బోనాలు తెలుగు సంస్కృతి కాబట్టి వెంకీ తెలుగు కుటంబానికి చెందిన వ్యక్తిగా చేసి ఉంటారు. ఆ పాత్ర కోసమే వెంకీని ఎంచుకుని ఉంటారు. టీజర్ లో చెప్పుకోదగ్గ సీన్స్ ఆయనకు పడలేదు. లాస్ట్ లో చిన్న యాక్షన్ షాట్ లో చూపించారు. టీజర్ లోనేనా లేక సినిమాలో కూడా వెంకీ రోల్ కి ప్రాధాన్యత ఉండదా! అనే సందేహం కలుగుతుంది. జగపతిబాబు మరో కీలక రోల్ చేస్తున్నారు. అయితే ఇది హిందీ టీజర్ నేపథ్యంలో నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కట్ చేసి ఉంటారు. ఫర్హాన్ సామ్జీ దర్శకుడు కాగా సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.