Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై నాలుగు వారాలు అవుతోంది. ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. 11 మంది మిగిలారు. వీరిలో ఒకరు నేడు ఎలిమినేట్ కానున్నారు. హౌస్ మేట్స్ పై ఆడియన్స్ లో ఒక అభిప్రాయం వచ్చింది. టైటిల్ రేసులో ఉన్నది ఎవరో ఓ క్లారిటీ వచ్చింది. అనూహ్యంగా ఓ లేడీ కంటెస్టెంట్స్ తన ఆట తీరుతో టైటిల్ ఫేవరేట్ గా మారింది. ఆమె ఎవరు? అందుకు కారణాలు ఏమిటో? చూద్దాం
బిగ్ బాస్ హౌస్లో రాణించడం అంత సులభం కాదు. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. ముఖ్యంగా మనో ధైర్యం ఉండాలి. ఆటలో స్పష్టత ఉండాలి. ఇతర కంటెస్టెంట్స్ ప్లే చేసే ట్రిక్స్, స్ట్రాటజీస్ అర్థం చేసుకోవాలి. నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులతో, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకడం కష్టమైన వ్యవహారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా లాంచ్ చేశారు. 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్లో అడుగుపెట్టారు.
బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ మొదటి మూడు వారాల్లో వరుసగా ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారానికి గాను ప్రేరణ, నబీల్, నాగ మణికంఠ, సోనియా, ఆదిత్య ఓం, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో సోనియా ఎలిమినేట్ కానుందని సమాచారం. ఈ వారం ఎలిమినేషన్ తో హౌస్లో 10 మంది మిగులుతారు. 5వ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి. కొత్తగా మరికొంత మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడతారు.
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి టైటిల్ గెలిచే అవకాశం ఉండదు. ఆల్రెడీ వాళ్ళు ఐదు వారాల గేమ్ చూసి హౌస్లోకి వచ్చారు కాబట్టి ప్రేక్షకుల నుండి పూర్తి మద్దతు ఉండదు. కాబట్టి ప్రస్తుతం హౌస్లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ లో ఒకరు విన్నర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ నుండి నిఖిల్ టైటిల్ రేసులో ఉన్నాడు. అతడు స్ట్రాంగ్ ప్లేయర్. నిఖిల్ ఫస్ట్ చీఫ్ కంటెండర్. ప్రతి టాస్క్ లో సత్తా చాటుతాడు.
అయితే నిఖిల్ ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. అతని గేమ్ లో స్పష్టత లోపించింది. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున కూడా తెరపైకి తెచ్చాడు. ఒక లీడర్ కి ఉన్న లక్షణాలు నిఖిల్ లో లేవని హౌస్ మేట్స్, ఆడియన్స్ తేల్చేశారు. ఇతరుల మాటలకు ప్రభావితం అవుతాడు. అతని నిర్ణయాలు అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సోనియా కారణంగా అతడి గేమ్ బాగా దెబ్బతింది. సోనియా అతన్ని ప్రభావితం చేస్తుంది. ఆమె చెప్పే మాటల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అలాగే సోనియా, నిఖిల్, పృథ్వి ఒక గ్రూప్ గా గేమ్ ఆడుతున్నాడు.
ఈ కారణాలతో నిఖిల్ టైటిల్ రేసులో వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలో కిరాక్ సీతకు ప్రేక్షకుల్లో ఇమేజ్ పెరిగింది. అందుకు కారణం.. ఆమె గేమ్ లో స్పష్టత. నిర్ణయాలలో పరిపక్వత. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా మాట్లాడే తీరు. సీత మొదటి రెండు వారాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ గత రెండు వారాల్లో తన గేమ్ ని బాగా మెరుగుపరుచుకుంది. క్లాన్ చీఫ్ అయ్యింది. ఇక టాస్క్ లలో అందరికీ అవకాశాలు ఇవ్వాలన్న ఆమె నిర్ణయానికి ప్రేక్షకులతో పాటు, ఆడియన్స్ లో మార్కులు పడ్డాయి.
ముఖ్యంగా నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఆడే ఛాన్స్ ఇవ్వాలి. వారు తమను నిరూపించుకోవడం ద్వారా ఓట్లు సంపాదించి ఎలిమినేషన్ నుండి తప్పించుకునే అవకాశం ఉందని ఆమె నమ్ముతుంది. ఇక స్ట్రాంగ్ కంటెస్ట్ గా ఉన్న నిఖిల్ లోపాలను ఆమె బయటపెట్టిన తీరు నచ్చింది. చాలా స్పష్టంగా నిఖిల్ గేమ్ లోని లోపాలు వివరించింది. సోనియా వలన అతని గేమ్ పాడవుతుందన్న నిజాన్ని ధైర్యంగా బయటపెట్టింది. రానున్న రోజుల్లో కిరాక్ సీత ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవతరించే అవకాశం ఉంది. టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యం లేదు.
Web Title: Kirrak seetha has the most chance to win bigg boss 8 telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com