Kiran Abbavaram: ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా, సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. టాలెంట్ తో పాటు , అదృష్టం కూడా కలిసి రావాలి. అలా కలిసొచ్చి , ఇండస్ట్రీ లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోలకు ఒక మంచి గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవాన్ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం. సినిమా సినిమాకు కిరణ్ అబ్బవరం తనని తానూ మార్చుకుంటూ, సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో ఎలా ముందుకు దూసుకుపోతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో భవిష్యత్తులో ఈయన మరో నాని లాంటి హీరో అవుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే రీసెంట్ గా కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ‘తిమ్మరాజు పల్లి టీవీ’ అనే చిత్రాన్ని నిర్మించాడు.
తన వద్ద అసిస్టెంట్ కెమెరా మెన్ గా పని చేస్తున్న సాయి తేజ్ ని హీరో గా పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆయనతో పాటు 50 మంది నటీనటులు , కొత్త టెక్నీషియన్స్ ని ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో సాయి తేజ్ లో మంచి విషయం ఉందని అనిపించింది. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా ఆయనకు మంచి పేరొస్తుంది, భవిష్యత్తులో హీరోగా ముందుకెళ్లొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం కోటి రూపాయిల బడ్జెట్ తో పూర్తి చేసినట్టు సమాచారం.
రీసెంట్ గానే ఆహా మీడియా సంస్థ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే నిర్మాతగా కిరణ్ అబ్బవరం విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నాడు అన్నమాట. ఇక థియేటర్స్ లో విడుదల అయ్యాక వచ్చే డబ్బులు మొత్తం బోనస్ అనే చెప్పాలి. కొత్తవాళ్లను పరిచయం చెయ్యడమే కాకుండా, నిర్మాతగా మంచి కాన్సెప్ట్ ని ఎంచుకొని, కేవలం ఓటీటీ రైట్స్ తోనే లాభాలు ఆర్జించి కిరణ్ అబ్బవరం చాలా తెలివిగా వ్యవహరించాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. కంటెంట్ బాగుంటే, హీరో ఎవరు అనేది చూడకుండా, టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు ఆడియన్స్. కాబట్టి ఈ సినిమాలో దమ్ము ఉంది అనే టాక్ బయటకు వస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించనంత వసూళ్లు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
