Producer Naga Vamsi: అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ట్రైలర్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ ఒక ఎత్తు, ట్రైలర్ ఒక ఎత్తు, ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఉంటుందని, ఈ చిత్రాన్ని తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికి చెంపదెబ్బ లాగా ట్రైలర్ ఉండబోతుందని ఆ చిత్ర నిర్మాత AM రత్నం బలమైన నమ్మకం తో చెప్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ ని పలువురు బయ్యర్స్ కు,సినీ ప్రముఖులకు చూపించాడు. వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాసేపటి క్రితమే ప్రముఖ యంగ్ నిర్మాత సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi) ఈ ట్రైలర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ లో నూతనోత్సాహం నింపింది.
Also Read: బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక.. అసమ్మతి రాజేసిన రాజాసింగ్
ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు హరి హర వీరమల్లు గురించి మీరంతా ఏమనుకున్నారో నాకు తెలియదు. కానీ, జులై 3 న ప్రతీ ఒక్కరు సర్ప్రైజ్ కి గురి అవుతారు. పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు. హరి హర వీరమల్లు ట్రైలర్ ఇచ్చే హై నుండి అభిమానులు అంత తేలికగా కోలుకోలేరు. గ్రాండియర్ వేరే లెవెల్ లో ఉంది. ఇలాంటి ఎనర్జీ ని మీరు భవిష్యత్తులో కూడా చూడలేరు’ అంటూ ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ వేసిన నిమిషాల వ్యవధి లోనే బాగా వైరల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ లో ఊగిపోయారు. అయితే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రానికి నాగవంశీ నే నిర్మాత. ఇప్పటికే రెండు సార్లు ఈ చిత్రం వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
అసలు ఇప్పట్లో ఈ సినిమా విడుదల అవుతుందా అంటే అనుమానమే. ఇలాంటి సమయం లో మా నిర్మాత ‘కింగ్డమ్’ చిత్రం గురించి తప్ప, అన్ని సినిమాల గురించి ట్వీట్స్ వేస్తున్నాడు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళ ట్వీట్స్ ని గమనించిన నాగ వంశీ వెంటనే మరో ట్వీట్ వేస్తూ ‘నేను ఏమి పోస్ట్ చేసినా కింగ్డమ్ విషయం లో నాకు ఫ్యాన్స్ నుండి శాపాలు తగులుతూనే ఉన్నాయి. కానీ నన్ను నమ్మండి, మీకు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని థియేట్రికల్ అనుభూతి ని ఇవ్వడానికి మా టీం నిరంతంరం కష్టపడి పని చేస్తుంది. నేను ఎంతో నమ్మితే కానీ ఇలాంటివి చెప్పను. ఎందుకంటే రేపు ఏదైనా తేడా జరిగితే మీ క్రియేటివిటీ మొత్తం నాపై చూపిస్తారు. సినిమాని చూసాను కాబట్టి చెప్తున్నా’ అంటూ ఆయన వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
I don’t know what you’re all expecting… but come July 3rd, you’re in for a surprise! @PawanKalyan garu ❤️
Get ready. Brace yourselves.#HariHaraVeeraMallu trailer packs a real high… It comes with scale, madness, and the kind of energy you didn’t see coming.…
— Naga Vamsi (@vamsi84) June 30, 2025